దేశంలోని అత్యంత శుభ్రమైన నగరాలుగా ఇండోర్, సూరత్.. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో వెల్లడి...
గంగా నది పొడవునా పరిశుభ్రత ప్రాముఖ్యతను గుర్తిస్తూ, వారణాసి, ప్రయాగ్‌రాజ్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో క్లీనెస్ట్ గంగా పట్టణాలుగా అగ్రస్థానాలను పొందాయి, వరుసగా 1వ, 2వ ర్యాంకుల్లో నిలిచాయి.
సూరత్ : భారతీయ నగరాలైన సూరత్, ఇండోర్ లు మరోసారి అత్యంత పరిశుభ్రమైన నగరాలుగా ఎన్నికయ్యాయి. స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2023లో ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా క్లీన్ సిటీ మొదటి, రెండు ర్యాంకులను ఇండోర్, సూరత్ లు కైవసం చేసుకున్నాయి. ఇండోర్, వరుసగా ఏడవసారి ఇలా టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మరోవైపు సూరత్ అత్యంత శుభ్రమైన నగరంగా ఎదగడానికి ఎంతో కృషి చేసింది.
క్లీన్‌నెస్ క్యాంపెయిన్ లో, నవీ ముంబై ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంకులో మూడో స్థానంలో నిలిచింది. గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా ఎదగడానికి ముంబై అంకితభవంతో ఎలా కృషి చేసిందో ఇది తెలుపుతుంది. ఈ గుర్తింపు నగరం చేపట్టిన పటిష్టమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, స్థిరమైన పట్టణ అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనం.
జల్లికట్టు పోటీలకు ఎద్దులను ఎలా తయారు చేస్తారో తెలుసా?
లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల విభాగంలో, సాస్వాద్ ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ 1ని పొందింది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన దేశంగా ఎదగడంలో ప్రశంసనీయమైన ప్రయత్నాలను చేసింది. దీనిని అనుసరిస్తూ పటాన్ ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ 2వ స్థానంలో నిలిచింది. లోనావాలా మూడవ స్థానంలో నిలిచింది. ఈ మూడు నగరాలు పరిశుభ్రత పట్ల వాటి అంకితభావాన్ని నొక్కి చెప్పాయి.
ఎమ్హెచ్ఓడబ్ల్యూ కంటోన్మెంట్ బోర్డు క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్‌గా గుర్తింపు పొందినందుకు ప్రశంసలు అందుకుంది. ఇతరులకు ప్రశంసనీయమైన ఉదాహరణగా నిలిచింది. మరోవైపు, చండీగఢ్, స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో ఉత్తమ సఫాయిమిత్ర సురక్షిత్ షెహెర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది, సురక్షితమైన, పరిశుభ్రమైన నగరాన్ని రూపొందించడంలో తమ నిబద్ధతను ప్రదర్శిస్తుంది.
గంగా నది పొడవునా పరిశుభ్రత ప్రాముఖ్యతను గుర్తిస్తూ, వారణాసి, ప్రయాగ్‌రాజ్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో క్లీనెస్ట్ గంగా పట్టణాలుగా అగ్రస్థానాలను పొందాయి, వరుసగా 1వ, 2వ ర్యాంకుల్లో నిలిచాయి. ఈ పవిత్ర నది పవిత్రతను కాపాడేందుకు వారి కృషి గణనీయంగా దోహదపడుతుంది.
అదే సమయంలో, స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర 1వ ర్యాంక్‌ను పొందింది. పరిశుభ్రత పట్ల రాష్ట్రం, నిబద్ధత దేశానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది. మధ్యప్రదేశ్ 2వ ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ర్యాంక్ పొందింది, క్లీన్ అండ్ గ్రీన్ ఇండియాగా మారడంతో తమ పాత్రను తెలిపింది.