Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: మూడు ల‌క్ష‌ల మార్కు దాటిన క‌రోనా రోజువారీ కేసులు !

Coronavirus: దేశంలో క‌రోనా వైరస్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దీంతో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసులు ఏకంగా మూడు ల‌క్ష‌ల మార్కును దాటిన‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు అందిన తాజాగా డేటా గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.  
 

Indias new COVID-19 cases cross 3-lakh mark on January 19, 2022
Author
Hyderabad, First Published Jan 20, 2022, 2:01 AM IST

Coronavirus: దేశంలో క‌రోనా వైరస్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దీంతో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసులు ఏకంగా మూడు ల‌క్ష‌ల మార్కును దాటిన‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు అందిన తాజాగా డేటా గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అందిన క‌రోనా రోజువారీ స‌మాచారం ప్ర‌కారం.. జనవరి 19న దేశంలో 3,13,603 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ఇది వారం క్రితంతో పోలిస్తే 27% పెరిగింది. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 3.8 కోట్ల‌కు పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 18.9 లక్షల మార్కును దాటింది. అయితే, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, లడఖ్, లక్షద్వీప్, త్రిపురలకు సంబంధించిన తాజా డేటా ఇంకా రావాల్సి ఉంది. ఈ డేటా అంచ‌నాలు క‌లుపుకుంటే రోజువారీ క‌రోనా కేసులు ఈ ఏడాదిలో కొత్త రికార్డులు నెల‌కోల్ప‌నున్నాయి.

జనవరి 19న మహారాష్ట్రలో 43,697 క‌రోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, క‌ర్నాట‌క‌లో 40,499, కేరళలో  34,199 కేసులు వెగులుచూశాయి. అలాగే, 475 మ‌ర‌ణాలు సైతం న‌మోద‌య్యాయి. గత వారంలో నమోదైన సగటు స్థాయిల కంటే ఇది చాలా ఎక్కువ. దీంతో కోవిడ్‌-19 మొత్తం మరణాల సంఖ్య 4,87,505కి చేరుకుంది. కొత్త మ‌ర‌ణాల్లో కేరళలో అధికంగా 134 మంది చ‌నిపోయారు. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (49), పశ్చిమ బెంగాల్ (38)లు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో మొత్తం 18.6 లక్షల క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న క‌రోనా వేవ్ లో  ఒక్క రోజులో అత్యధిక ప‌రీక్ష‌లు ఇవే. కోవిడ్‌-19 పరీక్ష సానుకూలత రేటు (TPR) 16.4 శాతంగా ఉంది. 

జనవరి 19 నాటికి, అర్హులైన జనాభాలో 90.4 శాతం మంది కనీసం ఒక మోతాదుతో టీకాలు వేయబడ్డారు. అయితే 65.7 శాతం మందికి రెండు డోసుల టీకాలు అందించారు. 15-17 సంవత్సరాల వయస్సు జనాభాలో 51.8 శాతం మంది మొదటి డోసు టీకాలు అందించారు. మొత్తంగా దేశంలో 92,05,14,321 మొదటి డోసులు, 66,96,51,317 రెండవ డోసులు ప్ర‌జ‌ల‌కు అందించారు. అలాగే, 60,27,041 బూస్టర్ డోస్‌లు కూడా అందించబడ్డాయి. ఇదిలావుండ‌గా, క‌రోనాకేసుల పెరుగుద‌ల కేర‌ళ‌లో అధికంగా ఉంది. గత 24 గంటల్లో 91,983 నమూనాలను పరీక్షిస్తే 34,199 మంది వ్యక్తులు COVID-19 బారిన‌ప‌డిన‌ట్టు తేలింది. అంత‌కు ముందు రోజు కేర‌ళ‌లో 28,481 కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి.యాక్టివ్ కేసుల పెర‌గ‌డంతో పాటు ఆస్ప‌త్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికం కావ‌డంపై రాష్ట్ర ప్ర‌భుత్వం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. 

తెలంగాణ‌లోనూ క‌రోనా కొత్త కేసులు భారీగా న‌మోదవుతున్నాయి. జనవరి 19న  రాష్ట్రంలో 3,557 కేసులు నమోదయ్యాయి. జూన్ 2021 తర్వాత రాష్ట్రంలో నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం. ఇదివ‌ర‌కు పట్టణ ప్రాంతాల్లోనే పెరుగుతున్న  కేసులు.. ప్ర‌స్తుతం గ్రామీణ జిల్లాల్లో కూడా పెరగడం ప్రారంభించాయి. మరో మూడు కోవిడ్-19 మరణాలు కూడా నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 24,253 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆస్ప‌త్రుల్లో చేరుతున్న వారి సంఖ్య సైతం క్ర‌మంగా పెరుగుతోంది. ప్రస్తుతం 680 మంది ఐసీయూల‌లో ఉన్నారు. 1,135 మంది ఆక్సిజన్ సపోర్ట్ పై ఉన్నారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ క‌రోనా బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. గ‌త 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 10,057 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. జూన్ 2021 తర్వాత రోజువారీ కేసులు అత్య‌ధికం న‌మోదుకావ‌డం ఇదే మొద‌టిసారి.  అలాగే, 8 మ‌ర‌ణాలు సైతం నమోద‌య్యాయి. కేవలం 14 రోజుల్లో, క‌రోనా TPR 1.6% నుండి 24.1%కి పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. బెంగాల్ లో కొత్త‌గా 11,447 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ కొత్త‌గా 20,966 మందికి క‌రోనా సోకింది. 

Follow Us:
Download App:
  • android
  • ios