సారాంశం

New Delhi: విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్సీఆర్ఏ కింద నమోదైన ప్రభుత్వేతర సంస్థలు (స్వ‌చ్ఛంద సంస్థ‌లు) వార్షిక రిటర్నుల దాఖలుకు సంబంధించిన నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవరించింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్, 2010లోని సెక్షన్ 48 ద్వారా ప్రసాదించిన అధికారాలను ఉపయోగించి, ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) రూల్స్-2011 ను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను మరింత కఠినతరం చేస్తుందని మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది.
 

FCRA-Ministry of Home Affairs: విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్సీఆర్ఏ కింద నమోదైన ప్రభుత్వేతర సంస్థలు (స్వ‌చ్ఛంద సంస్థ‌లు) వార్షిక రిటర్నుల దాఖలుకు సంబంధించిన నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవరించింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్, 2010లోని సెక్షన్ 48 ద్వారా ప్రసాదించిన అధికారాలను ఉపయోగించి, ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) రూల్స్-2011 ను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను మరింత కఠినతరం చేస్తుందని మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది.

వివ‌రాల్లోకెళ్తే.. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద నమోదైన ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు) వార్షిక రిటర్నుల దాఖలుకు సంబంధించిన నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవరించింది. విదేశీ విరాళాల నియంత్రణ నిబంధనలు-2010 లో రెండు క్లాజులను చేర్చడం ద్వారా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్పులు చేసింది. (బీఏ) విదేశీ విరాళాల నుండి సృష్టించిన చరాస్తుల వివరాలు (ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి),  (బీబీ) విదేశీ విరాళాల నుండి సృష్టించిన స్థిరాస్తుల వివరాలు (ఆర్థిక సంవత్సరం మార్చి 4 నాటికి)- ఫారం ఎఫ్సీ-4లో చేర్చింది.

విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం-2010 లోని (42 of 2010) లోని సెక్షన్ 48 ద్వారా ప్రసాదించిన అధికారాలను ఉపయోగించి మార్పులు తీసుకువ‌చ్చిన‌ట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీ విరాళాల (నియంత్రణ) నిబంధనలను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది నిబంధనలను తీసుకువ‌చ్చింద‌ని పేర్కొంటూ.. విదేశీ విరాళాల‌ నియంత్రణ నియమాలు 2011. అవి: 1. సంక్షిప్త శీర్షిక, ప్రారంభం - (I) ఈ నియమాలను విదేశీ కాంట్రిబ్యూషన్ (నియంత్రణ) సవరణ నియమాలు 2023 అని పిలవవచ్చు. (2) అవి వాటి ప్రచురణ తేదీ నుండి అమలులోకి వస్తాయ‌ని అధికారిక గెజిట్ లో పేర్కొంది. అలాగే, విదేశీ సహకారంతో సృష్టించబడిన చ‌రాస్తులు (ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి),  విదేశీ విరాళాలతో (ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి) కొనుగోలు చేసిన స్థిరాస్తుల వివరాలు తెలియజేయాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.