UAV Crash: భారత వైమానిక దళానికి చెందిన మానవరహిత వైమానిక వాహనం (UAV) ప్రమాదానికి గురైంది. సోమవారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని IAF ఎయిర్‌బేస్ సరిహద్దు సమీపంలో టేకాఫ్ అయిన వెంటనే ఈ విమానం కూలినట్టు అధికారులు వెల్లడించారు.
UAV Crash: భారత వైమానిక దళానికి చెందిన మానవరహిత వైమానిక వాహనం (UAV) ప్రమాదానికి గురైంది. సోమవారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈ ప్రమాదం జరిగింది. గాల్లోకి ఎగిరిన విమానం అకస్మాత్తుగా నేలపై కూలిపోయింది. జైసల్మేర్‌లోని షాహీద్ సగర్మల్ గోపా కాలనీకి సమీపంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఈ విమానం నివాస ప్రాంతాలకు దూరంగా.. కూలడంతో ప్రమాదం తప్పింది. ఎవరికీ ఏలాంటి నష్టం వాటిల్లేదని అధికారులు తెలిపారు.
విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మానవ రహిత విమానం(యూఏవీ)..రిమోట్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది డ్రోన్ కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. దీనిని నిఘా కోసం ఎయిర్‌ఫోర్స్ ఉపయోగిస్తుంది. విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందనీ, ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
