India: "ద్వేషపూరిత ప్రసంగాలు.. ద్వేషపూరిత హత్యలు క్రమంగా పెరుగుతున్నాయి. యావత్ ప్రపంచాన్ని ముంచెత్తకుండా ఈ పిచ్చిని ఆపడానికి మనం అన్ని మార్గాలను ఉపయోగించాలి" అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం పేర్కొన్నారు.
Texas shooting-Chidambaram : ఈ వారంలో అమెరికాలోని టెక్సాస్ పాఠశాలలో జరిగిన కాల్పుల ఊచకోత యావత్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. మరోసారి గన్ కల్చర్ ప్రపంచ దేశాలను ఆలోచించుకునేలా చేసింది. ఇప్పుడు చాలా దేశాలు ఆయుధాల విషయంపై చర్చలను జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయుధాలు, తుపాకుల నియంత్రణపై అమెరికా చట్టాలు చాలా సున్నితంగా ఉన్నాయని, ఆయుధాల కొనుగోలు మరియు స్వాధీనంకి సంబంధించిన చట్టాలను భారతదేశం కూడా సమీక్షించి, కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీ. చిదంబరం గురువారం పేర్కొన్నారు.
USలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. పాఠశాల కాల్పుల్లో ఒక 18 ఏళ్ల ముష్కరుడు టెక్సాస్ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదిలో 19 మంది పిల్లలు మరియు ఇద్దరు పెద్దలతో సహా మొత్తం 21 మందిని కాల్చి చంపాడు.ఇలాంటి చర్చలను అరికట్టడానికి.. పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని.. ఆయుధాల చట్టాలను మరింత కఠినంగా మార్చాలని చిదంబరం విజ్ఙప్తి చేశారు. టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 19 మంది పిల్లలను దారుణంగా హత్య చేయడాన్ని ఖండించడానికి మాటలు రావడం లేదని, అమెరికా ప్రజలు, మృతుల కుటుంబాలతో ప్రపంచం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిందని చిదంబరం అన్నారు.
అలాగే, "ద్వేషపూరిత ప్రసంగాలు మరియు ద్వేషపూరిత హత్యలు వృద్ధి చెందుతున్నందున, ప్రపంచం మొత్తాన్ని ముంచెత్తకుండా ఈ పిచ్చిని ఆపడానికి మనం అన్ని మార్గాలను ఉపయోగించాలి" అని మాజీ హోం మంత్రి చిదంబరం వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. "ఒక మార్గం ఏమిటంటే తీవ్రమైన తుపాకీ నియంత్రణలను విధించడం మరియు ఆయుధాన్ని ఎవరు కొనుగోలు చేయవచ్చో లేదా స్వంతం చేసుకోగలరో కఠినంగా నియంత్రించడం ముఖ్యం" అని ఆయన అన్నారు. ఈ విషయంలో అమెరికా చట్టాలు చాలా వదులుగా మరియు చాలా సరళంగా ఉన్నాయని చిదంబరం పేర్కొన్నారు. "భారతదేశం కూడా ఆయుధాల కొనుగోలు మరియు స్వాధీనానికి సంబంధించిన చట్టాలను సమీక్షించి, కఠినతరం చేయాలి" అని ఆయన అన్నారు.
కాగా, అమెరికాలోని శాన్ ఆంటోనియోకు 134 కిలోమీటర్ల దూరంలోని టెక్సాస్‌లోని ఉవాల్డే పట్టణంలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో మంగళవారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి. 2 ఘటనలో మొత్తం 23 మందిని కాల్చిచంపాడు ఓ దుండగుడు. టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఫర్ పబ్లిక్ సేఫ్టీ ప్రతినిధి లెఫ్టినెంట్ క్రిస్ ఒలివారెజ్ ప్రకారం, ఉవాల్డేలోని ఒక తరగతి గదిలోనే అన్ని మరణాలు సంభవించాయి. ఒక షూటర్ ఒక గదిలోకి ప్రవేశించి.. అడ్డుకున్న ఇద్దరు ఉపాధ్యాయులు సహా 19 మంది పిల్లలను కాల్చి చంపాడు.
