Asianet News TeluguAsianet News Telugu

Brahmos Supersonic Cruise Missile: భారత అమ్ములపొదలో మరో బ్రహ్మాస్త్రం !

Brahmos Supersonic Cruise Missile: భారత అమ్ములపొదలో మరోబ్రహ్మాస్త్రం వ‌చ్చి చేరింది. శ‌త్రు దేశాల నుంచి పొంచి వున్న ముప్పునేప‌థ్యంలో భార‌త్ త‌న ఆయుధ సంప‌త్తిని పెంచుకుంటూ బ‌ల‌మైన దేశంగా మారుతోంది. ఈ క్ర‌మంలోనే భారత నౌకాదళ విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నుంచి పశ్చిమ తీరంలో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ మంగ‌ళ‌వారం విజయవంతంగా పరీక్షించింది.
 

India Successfully Test-fires BrahMos Supersonic Cruise Missile Off Western Coast
Author
Hyderabad, First Published Jan 11, 2022, 3:28 PM IST

Brahmos Supersonic Cruise Missile: భారత అమ్ములపొదలో మరోబ్రహ్మాస్త్రం వ‌చ్చి చేరింది. శ‌త్రు దేశాల నుంచి పొంచి వున్న ముప్పునేప‌థ్యంలో భార‌త్ త‌న ఆయుధ సంప‌త్తిని పెంచుకుంటూ బ‌ల‌మైన దేశంగా మారుతోంది. ఈ క్ర‌మంలోనే భారత నౌకాదళ విధ్వంసక నౌక ఇండియన్ నేవీ షిప్ (ఐఎన్‌ఎస్) విశాఖపట్నం నుంచి పశ్చిమ తీరంలో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ విజయవంతంగా  ప‌రీక్షించింది. సముద్రం నుండి సముద్రానికి వైవిధ్యమైన క్షిపణిని గరిష్ట రేంజ్‌లో ప్రయోగించి, లక్ష్య నౌకను అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు భారత నావికాదళ వర్గాలు తెలిపాయి. చైనా, పాక్‌లతో సరిహద్దుల్లో నిరంతరం ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొని ఉన్న సమయంలో భారత్ ఈ పరీక్ష చేయడం గ‌మ‌నార్హం.  బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఎయిర్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) డిసెంబరులో తెలియజేసిన ఒక నెల తర్వాత బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి  స‌ముద్రం నుంచి స‌ముద్ర ప్ర‌యోగానికి సంబంధించిన బ్ర‌హ్మోస్ గ‌రిష్ట స్థాయి టార్గెట్ ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించింద‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన‌డం విశేషం. 

 

ఇదిలావుండ‌గా, ఇంత‌ముందు అంటే గ‌తేడాది (2021) డిసెంబరు 8న, సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఎయిర్ టు ఎయిర్ వేరియంట్‌ను ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి విజయవంతంగా ప్రయోగించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దీనిని సంబంధించి వివ‌రాల‌ను వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల అభివృద్ధిలో తాజాగా విజ‌య‌వంత‌మైన స‌ముద్రం నుంచి స‌ముద్రాల‌పై ఈ మిషన్‌ను ప్రధాన మైలురాయిగా అని చెప్పాలి. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఎయిర్ టు ఎయిర్ వేరియంట్‌ను సూపర్‌సోనిక్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ సుఖోయ్ 30 Mk I నుండి పరీక్షించినట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

బ్రహ్మోస్ క్షిపణుల ప్రత్యేకతలు ఇవే.. ! 

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు అత్యాధునిక సాంకేతిక‌త‌ను క‌లిగి ఉంటాయి. టార్గెట్ ను ఛేధించ‌డంలో ఖచ్చితత్వం ఎక్కువ‌గా ఉంటుంది. గ‌రిష్ట ప‌రిధి కూడా దీని సొంతం. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల మ‌రో ప్ర‌ధాన‌మైన విష‌యం ఏమిటంటే..ఈ క్షిప‌ణులు శత్రు రాడార్ నుండి తప్పించుకోవడంలో మెరుగైన ప‌నీతీరును క‌న‌బ‌రుస్తాయి. వీటిని నింగి, నెల‌, నీరు ఎక్క‌డినుంచైనా ప్రయోగించ‌వ‌చ్చు.  ఈ క్షిపణి గంటకు 4300 కి.మీ వేగంతో శత్రు స్థానాలను ధ్వంసం చేయగలదు. ఇది 400 కి.మీ పరిధిలో శత్రువులను టార్గెట్ చేయగలదు. బ్రహ్మోస్ క్షిపణిని రష్యా, భారత్ సంయుక్త ప్రాజెక్టుగా అభివృద్ధి చేశాయి. అందుకే ఈ క్షిప‌ణుల‌కు బ్ర‌హ్మోస్ అని పేరు పెట్టారు. ఈ పేరులో రెండు దేశాల అంశాలు ఉన్నాయి. బ్ర‌హ్మోస్ లో బ్రహ్ అంటే ‘బ్రహ్మపుత్ర’, మోస్ అంటే ‘మోస్క్వా’. రష్యాలో ప్రవహించే నది పేరు మోస్క్వా. బ్ర‌హ్మ‌పుత్ర న‌ది భార‌త్ లో ప్ర‌వ‌హిస్తుంది. దేశంలోని అతిపొడ‌వైన న‌దుల్లో ఇది ఒక‌టి. అందుకే భార‌త్‌, ర‌ష్యాల సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిప‌ణుల‌కు బ్ర‌హ్మోస్ అని పేరు పెట్టారు.  

Follow Us:
Download App:
  • android
  • ios