ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. కేరళ రాష్ట్రంలో  ఒక్క రోజే 31,445 కొత్త కేసులు నమోదయ్యాయి.దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,25,58,550కి చేరుకొన్నాయి. ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. కేరళ రాష్ట్రంలో  ఒక్క రోజే 31,445 కొత్త కేసులు నమోదయ్యాయి.దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,25,58,550కి చేరుకొన్నాయి. నిన్న ఒక్క రోజే కరోనా యాక్టివ్ కేసులు 11,398కి చేరుకొన్నాయి.

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. నిన్న ఒక్క రోజులోనే దేశ వ్యాప్తంగా 46,154 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,25,58,550కి చేరుకొన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,33,725కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా యాక్టివ్ కేసులు 11,398కి చేరుకొన్నాయి.

రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 2,58గా నమోదైంది.30 రోజులుగా 3 శాతం కంటే తక్కువగానే ఉందని ఐసీఎంఆర్ తెలిపింది. వారాంతపు కరోనా పాజిటివిటీ రేటు 2.02 శాతంగా నమోదైంది. 62 రోజులుగా 3 శాతంలోపుగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

కరోనాతో దేశంలో ఇప్పటివరకు 4,36,365 మంది మరణించారు. కేరళ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 31,445 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. టీపీఆర్ రేటు 19.05 గా నమోదైంది.దేశంలో నిన్న17,87,283 కరోనా పరీక్షలు నిర్వహించారు. 46,164 మందికి నిర్ధారణ అయినట్టుగా ఐసీఎంఆర్ తెలిపారు.



హైదరాబాద్: