ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. అంతకు ముందు రోజుతో పోలిస్తే నిన్న  31,923 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 282 మంది కరోనాతో మరణించారు.దీంతో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4.46 లక్షలకు చేరుకొంది. 

న్యూఢిల్లీ: ఇండియాలో(india) గత 24 గంటల్లో 31,923 కొత్త కరోనా(corona cases) కేసులు నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలోనే నిన్న ఒక్క రోజే 19,675 కొత్త కేసులు నమోదయ్యాయి.దేశ వ్యాప్తంగా ఇండియాలో 3.01 లక్షల కరోనా యాక్టివ్ కేసులున్నాయని ఐసీఎంఆర్(icmr) ప్రకటించింది. కేరళ (kerala)రాష్ట్రంలో 1.61 లక్షల యాక్టివ్ కేసులున్నాయని ఐసీఎంఆర్ ప్రకటించింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 282 మంది కరోనాతో మరణించారు.దీంతో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4.46 లక్షలకు చేరుకొంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత 24 గంటల్లో 15,27,443 మందికి కరోనా పరీక్సలు నిర్వహించారు. అంతకు ముందు రోజుతో పోలిస్తే కరోనా కేసులు 18 శాతం పెరిగాయి. ఇండియాలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 3.35 కోట్లకు చేరుకొంది. కరోనా నుండి ఇప్పటివరకు 3.28 కోట్ల మంది కోలుకొన్నారు.నిన్న ఒక్క రోజే కరోనా నుండి 31 వేల మంది కోలుకొన్నారు. కరోనా రోగుల రికవరీ రేటు 97.77 శాతంగా నమోదైంది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 0.90 శాతానికి తగ్గింది.