Asianet News TeluguAsianet News Telugu

భద్రతా మండలిలో చైనా కుయుక్తులు: ఎండగట్టిన భారత్

తమ దేశ అంతర్గత వ్యవహరాల్లో తలదూర్చే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇండియా చైనాకు స్పష్టం చేసింది. ఇలాంటి వృధా ప్రయత్నాలను మానుకోవాలని భారత విదేశాంగ శాఖ  సూచించింది.

India again rejects Chinas interference in internal affairs
Author
New Delhi, First Published Aug 6, 2020, 5:42 PM IST

న్యూఢిల్లీ: తమ దేశ అంతర్గత వ్యవహరాల్లో తలదూర్చే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇండియా చైనాకు స్పష్టం చేసింది. ఇలాంటి వృధా ప్రయత్నాలను మానుకోవాలని భారత విదేశాంగ శాఖ  సూచించింది.

జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ ను రద్దు చేసి ఏడాది పూర్తైంది. దీన్ని పురస్కరించుకొని  బుధవారం నాడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాశ్మీర్ అంశాన్ని చర్చించేందుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నానికి  చైనా మద్దతు తెలిపింది. అయితే ఈ ప్రయత్నాలు ఫలించలేదు.

చైనా ప్రయత్నాలను భారత్ ఎండగట్టింది. తమ అంతర్గత వ్యవహరాల్లో తలదూర్చే ప్రయత్నాలపై చైనా తీరును భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. 
గతంలో కూడ ఇదే తరహాలో చైనా వ్యవహరించిన విషయాన్ని భారత్ గుర్తు చేసింది. 

గత ఏడాదిలో జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాాాలుగా కేంద్రం మార్చింది. 370 ఆర్టికల్ ను రద్దు చేసింది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని 370 ఆర్టికల్ ను రద్దు చేసింది. స్వంతంగా మెజారిటీ ఉండడంతో బీజేపీ నాయకత్వం తన ఎజెండాను అమలు చేసిందని అప్పట్లో విపక్షాలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios