పులులు, సింహాలు.. వాటికి ఆకలేస్తే ఇతర జంతువులను వేటాడి తింటాయి అన్న విషయం మన అందరికీ తెలిసిందే.. కానీ.. వాటిలో వాటిని చంపి తినడం విని ఉండరు. కానీ.. అదే జరిగింది. ఓ మగపులి.. ఆడపులిని చంపి.. తినేసింది. ఈ వింత అరుదైన సంఘటన మధ్యప్రదేశ్ లోని కన్హా టైగర్ రిజర్వ్ లో చోటుచేసుకుంది.

మగపులి.. ఆడపులిని చంపి తినేసిందని అక్కడి అటవీశాఖ అధికారులు తెలిపారు. శనివారం పెట్రోలింగ్ కి వెళ్లిన అటవీ శాఖ అధికారులకు ఆడపులికి చెందిన పుర్రె, నాలుగు ఇతర అవయవాలు కనిపించాయి. అందులో ఒక అవయవం సగం తినేసినట్లుగా ఉందని.. కన్హా టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ కృష్ణమూర్తి తె లతిపారు. అదే ప్రాంతంలో ఓ మగపులి సంచరిస్తోందని.. అదే చంపి ఉంటుందని వారు వెల్లడించారు.

రెండు పులులు భీకరంగా పోట్లాడుకున్నాయని.. ఆడపులిని.. మగపులి దాదాపు 700కిలోమీటర్ల మేర లాక్కెళ్లినట్లు అక్కడి పరిస్థితులు  చూస్తే అర్థమౌతోందని అక్కడి అధికారులు తెలిపారు. ఇది కచ్చితంగా వేటగాళ్ల పని అయితే కాదు అని వారు చెప్పారు. ఒక పులిని మరొక పులి చంపిన సంఘటనలు గతంలో ఉన్నాయన్నారు.