బాస్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక వివాహిత అడ్డుగా ఉన్న భర్తను సుపారీ..  ఇచ్చి హత్యకు స్కెచ్ వేసిన సంఘటన నెలమంగలం తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

కర్ణాటక : వివాహేతర సంబంధాలు రోజురోజుకూ ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ సంబంధాల ముసుగులో భార్య లేదా భర్తను హత్య చేయడానికి వెనుకాడడం లేదు. తమ కోరికకు అడ్డుగా ఉంటున్నారని కన్న పిల్లలను కూడా కడతేరుస్తున్న ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తమ సంబంధానికి అడ్డుగా ఉంటున్నాడని కట్టుకున్న భర్తను స్కెచ్ వేసి మరీ కడతేర్చాలని చూసింది ఓ భార్య. చివరికి ఆప్రయత్నం విఫలం కావడంతో అరెస్టై జైల్లో పడింది. ఈ ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. 

బాస్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక వివాహిత అడ్డుగా ఉన్న భర్తను సుపారీ.. ఇచ్చి హత్యకు స్కెచ్ వేసిన సంఘటన నెలమంగలం తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

కేసుకు సంబంధించి పోలీసులు మహిళతో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. 
భర్త అడ్డుగా ఉన్నాడని.. నెలమంగలం తాలూకా అరిశిన కుంట నివాసి గిరీష్ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. గిరీష్ భార్య చైత్ర, ఈమె పనిచేసే లారీ షోరూం బాస్ కల్లేశ్ జైన్, ఇతడి అనుచరులు కారు డ్రైవర్ ప్రభు, గోపాలయ్య, శికుమార్, నాగరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 10 లక్షలు సుపారి ఇచ్చినట్లు జైన్ ఒప్పుకున్నాడు.