తమ ప్రేమను అంగీకరించలేదనో.. పెళ్లికి ఒకే చెప్పలేదనో.. ఇప్పటి వరకు చాలా మంది అమ్మాయిలపై యాసిడ్ ఎటాక్ లు జరిగాయి. అయితే.. తాజాగా.. ఓ యువతి తాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది.

తనని కాకుండా మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడనే కోపంతో.. ప్రియుడిని చంపేసింది. ఈ సంఘటన ఆగ్రాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగ్రాకి చెందిన సోనమ్ పాండే(25) అనే యువతి దేవేంద్ర కుమార్(28) అనే యువకుడిని ప్రేమించింది. వారిద్దరూ చాలా కాలంగా  ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.  రిలేషన్ లో కూడా ఉన్నారు. అతనిని పెళ్లి చేసుకుంటానని సోనమ్ కలలు కన్నది. అయితే.. ఆమెకు తెలీకుండా.. దేవేంద్ర కుమార్ మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు.

ఈ విషయం కాస్త సోనమ్ కి తెలియడంతో.. ఆగ్రహంతో ఊగిపోయింది. తనని కాదని మరో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడని అతనిపై పగ పెంచుకుంది. ఈ క్రమంలోనే.. దేవేంద్ర కుమార్ పై యాసిడ్ తో దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రగాయాలై.. దేవేంద్ర ప్రాణాలు కోల్పోయాడు. సోనమ్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.