Asianet News TeluguAsianet News Telugu

‘ఈ బుడ్డోడి కోరిక తీరిస్తే.. నేను దివాలా తీయాల్సిందే’.. ఆనంద మహీంద్రా ట్వీట్ వైరల్

ఈ వైరల్ వీడియోలో, చీకు యాదవ్ అనే చిన్నారి మహీంద్రా థార్ కొనాలని.. దాని ధర కేవలం రూ.700లే కదా అంటూ ముద్దుముద్దుగా మాట్లాడాడు. 

If this child's wish comes true, we would be bankrupt'.. Ananda Mahindra's tweet goes viral - bsb
Author
First Published Dec 25, 2023, 10:34 AM IST

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటారు. తరచుగా అనేక అంశాలమీద విభిన్నమైన పోస్టులు చేస్తుంటారు. బిజినెస్ మ్యాన్ గానే కాక చక్కటి మానవతావాదిగా పేరొందారు. కొన్నిసార్లు ఎంతో ఫన్నీగా రియాక్ట్ అవుతుంటారు. అలాంటి ఓ ఫన్నీ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ చిన్నారి వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తుంది. ఆ చిన్నారి మాటలు అందర్నీ అబ్బురపరుస్తున్నాయి. 

ఆదివారం, షేర్ చేసిన ఓ వీడియోలో ఓ చిన్నారి మహీంద్రా థార్ కారును కేవలం రూ. 700కి కొనుక్కోవచ్చని నమ్ముతున్నాడు. ఆ నిమిషం 29 సెకన్ల వీడియోలోఈ మేరకు ఆ చిన్నారి తన తండ్రితో దాని గురించి చెబుతున్నాడు. నోయిడాకు చెందిన చీకు యాదవ్ అనే చిన్నారి సంభాషణలో తన తండ్రితో మహీంద్రా థార్ కొనాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. మహీంద్రా కార్లు థార్, XUV 700 ఒకటేనని, రెండింటినీ రూ. 700కి కొనుగోలు చేయవచ్చని ఆ బాలుడు అమాయకంగా నమ్ముతున్నాడు.

ayodhya ram mandir : అయోధ్యకు తమిళనాడులో తయారైన 48 గుడిగంటలు.. ఒక్కోదాని బరువెంతో తెలుసా?

ఆ చిన్న పిల్లాడి అమాయకత్వం సోషల్ మీడియా వినియోగదారులను ఆకర్షించింది. ఆనంద్ మహీంద్రా దృష్టికి ఈ వీడియో వచ్చింది. ఆ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా.. ఆ చిన్నారి కోరినట్టుగా తాను, తన కంపెనీ థార్‌ను రూ. 700కి విక్రయిస్తే, త్వరలో దివాళా తీయాల్సి వస్తుందని చమత్కరించారు.

''ఐ లవ్ చీకూ'' అంటూ నా ఫ్రెండ్ సూని తారాపొరేవాలా నాకు ఈ వీడియో పంపారు. నేను కూడా అతని కొన్ని పోస్ట్‌లను Instagram (@cheekuthenoidakid)లో చూశాను. నేను కూడా ఇప్పుడు అతడిని ఇష్టపడుతున్నాను. కానీ, ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. చీకూ అనుకున్నట్లుగా.. థార్‌ను రూ. 700 రూపాయలకు అమ్మితే, చాలా త్వరగా దివాలా తీస్తాం”అని అన్నారు. 

ఈ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. నెటిజన్లు అనేక కామెంట్లతో హోరెత్తించారు. కొందరు ఆ అమాయక బాలుడి కోరికను నెరవేర్చమని అభ్యర్థించగా, మరికొందరు ఈ ఐడియాతో ఏదైనా బిజినెస్ ఆలోచించొచ్చు అని అన్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, ''ఆనంద్ సర్, మీరు అసాధారణమైనవారు!! గొప్ప భారతీయుడు, విజయవంతమైన వ్యాపారవేత్త !! అపారమైన గౌరవం, ప్రశంసలు, చాలా బాగా సంపాదించారు''అని అన్నారు. 

మరొకరు కామెంట్ చేస్తూ.. ''700 రూపాయలు చేయడం మంచి ఆలోచన. థార్ లేదా XUV 700 బొమ్మ కారు, ఎంపిక చేసిన మోడల్‌లతో బహుమతిగా ఇచ్చేలా తయారు చేయచ్చు. ఇది పిల్లలకు చాలా ఇష్టమవుతుంది అని సలహా ఇచ్చారు. 

ఇంకొకరు.. ''మీ కోసం ఐడియా @anandmahindra ji. రూ. 700/- చెల్లించి  #XUV700ని బుక్ చేసుకోమనండి.. వారందరిలో లక్కీ డ్రా తీసి..ఒక విజేతకు #XUV700ని ఇవ్వండి. దీనివల్ల మీకూ నష్టం రాదు. కస్టమర్ హ్యాపీ ఫీలవుతాడు. ఈ డ్రా ద్వారా ఇంకా ఎక్కువ వసూలైతే.. ఆ మొత్తాన్ని విరాళం ఇవ్వండి’ అని సలహా ఇచ్చారు.

క్రిస్మస్ సందర్భంగా ఆ చిన్నారి కోరిక నెరవేర్చి అతనికి శాంతాక్లాజ్ గా మారండి.. అంటూ కామెంట్ చేశారు. మరొకరేమో.. పిల్లవాడు తనకు తెలియకుండానే మీ బ్రాండ్‌ ను అమాయకంగా ప్రమోట్ చేస్తున్నాడు. చాలా నిజాయితీతో ప్రచారం చేసాడు! ప్లీజ్, అతనికి ఒకటి బహుమతిగా ఇవ్వండి’ అంటూ బతిమాలారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios