మహారాష్ట్రలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే ప్రతి ఇంటికి మంచినీళ్లు: కేసీఆర్

మహారాష్ట్రలో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువస్తే  ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని   కేసీఆర్ హామీ ఇచ్చారు.  తెలంగాణ మోడల్ ను   దేశంలో  అమలు  చేయాల్సిన అవసరం ఉందన్నారు. 
 

IF BRS  Get  Power  In Maharashtra  We  will  Give  to Every household To drinking water  lns


ముంబై: దేశంలో అనివార్యమైన మార్పును తీసుకురావడం కోసం బీఆర్ఎస్ పుట్టిందని   తెలంగాణ సీఎం  కేసీఆర్  చెప్పారు. దేశంలో మార్పు వచ్చే వరకు  బీఆర్ఎస్ పోరాటం ఆగదని  ఆయన   తెలిపారు.  కులం, మతం ప్రాతిపదికన  బీఆర్ఎస్ ఏర్పడలేదన్నారు. కొత్త పార్టీ వస్తే  ఎన్నో అపవాదులు సృష్టిస్తారన్నారు.  ఎన్ని ఆటంకాలు  సృష్టించినా  తాము భయపడేది లేదని  కేసీఆర్  ప్రకటించారు.  మార్పు  రాకుంటే  దేశం ముందుకెళ్లదన్నారు. 

మహారాష్ట్రలోని  ఔరంగబాద్ లో  సోమవారంనాడు రాత్రి నిర్వహించిన  బీఆర్ఎస్ బహిరంగ సభలో  కేసీఆర్ ప్రసంగించారు.  రాష్ట్రంలోని  ఔరంగబాద్, అకోలాలో నీటి ఎద్దడి  ఉందని  కేసీఆర్  చెప్పారు. మహారాష్ట్రలో  ఇన్ని  నదులు  ప్రవహిస్తున్నా  ఈ కరువు  ఎందుకు  వస్తుందని  ఆయన  ప్రశ్నించారు.   దేశంలో  కూడ అనేక  జీవనదులున్నా కూడా నీటి సమస్య ఎందుకు వచ్చిందని  ఆయన  ప్రశ్నించారు. ముంబై  దేశ ఆర్ధిక రాజధాని , కానీ తాగేందుకు  నీళ్లుండవా అని కేసీఆర్ ప్రశ్నించారు.  తాగడానికి  నీళ్లు  దొరకని  పాపానికి బాధ్యులెవరని  కేసీఆర్ అడిగారు.  తెలంగాణలో నీటి సమస్య లేకుండా  చేశామని ఆయన  చెప్పారు.  నెహ్రు హయంఅలో  నీటి ఎద్దడి నివారణకు  ప్రయత్నాలు  చేసిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు.  దేశంలో   అనేక ప్రధానులు మారినా కూడా  ఈపరిస్థితిలో మార్పు రాలేదేన్నారు.  

దేశం పురోగమిస్తుందా , తిరోగమిస్తుందా ఆలోచించాలని  కేసీఆర్  ప్రజలను  కోరారు. ఇది  ఇలానే జరగాలా..  చికిత్స  చేయాలా చెప్పాలన్నారు.   ఇంకెంత కాలం సమస్యల   పరిష్కారం కోసం ఎదురుచూడాలని కేసీఆర్ ప్రశ్నించారు. ఆత్మహత్యలు  చేసుకొనే  పరిస్థితి కల్పిస్తున్నా ఊరుకోవాలా అని  కేసీఆర్ అడిగారు.  తాను చెప్పే మాటలను  ఇక్కడ విని  ఇక్కడే మర్చిపోవద్దని  కేసీఆర్ కోరారు.  తాను చెప్పిన మాటలను  గ్రామాల్లో చర్చకు పెట్టాలని  ఆయన ప్రజలను కోరారు. భయపడుతుంటే  ఇంకా భయపెడతారన్నారు. ధైర్యంగా పోరాడితేనే  సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కేసీఆర్  చెప్పారు. 

మహారాష్ట్రలో  బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే  ప్రతి ఇంటికి  నరు అందిస్తామని  ఆయన  ప్రకటించారు. ఐదేళ్లలోపు  ప్రతి ఇంటికి నీటిని ఇస్తామని  కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో  24 గంటల విద్యుత్  సరఫరా చేస్తున్నామన్నారు. కానీ మహారాష్ట్రలో ఎందుకు  సాధ్యం కాదని కేసీఆర్ ప్రశ్నించారు.  

దేశంలో సంపన్నులు  మరింత  సమపన్నులుగా  మారుతున్నారన్నారు. పేదలు  మరింత పేదరికంలో కూరుకుపోతున్నారని  కేసీఆర్  ఆవేదన వ్యక్తం  చేశారు. దేశంలోని సమస్యలను  మనమే పరిష్కరించుకోవాలని కేసీఆర్  చెప్పారు. ఎంత త్వరగా మనం మేల్కొంటే అంత బాగుపడుతామని  కేసీఆర్  చెప్పార. 

ఈ దేశంలో  సమృద్ధిగా  నీటి వనరులున్నాయని  కేసీఆర్  చెప్పారు.  విద్యుత్ రంగాన్ని  ప్రైవేటీకరించేందుకు  కేంద్రం ప్రయత్నిస్తుందని  కేసీఆర్ ఆరోపించారు. ఎవడబ్బ సొమ్ము అని  విద్యుత్ రంగాన్ని  ప్రైవేటీకరిస్తారని  కేసీఆర్ ప్రశ్నించారు. గులాబీ జెండాను  స్థానికసంస్థల ఎన్నికల్లో గెలిపించాలని కేసీఆర్ కోరారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios