Asianet News TeluguAsianet News Telugu

ఐసీఐసీఐ స్కాం : చందాకొచర్ కు బెయిల్..

ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ కుంభకోణం కేసులో ఆ బ్యాంక్ మాజీ సీఎండీ చందా కొచర్‌కు ఊరట లభించింది. ఈ కేసులో చందాకొచర్ కు ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు  బెయిల్‌ మంజూరు చేసింది. విచారణకు హాజరైన ఆమెకు రూ. 5 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. 

icici videocon case : chanda kochhar gets bail, asked not to leave india - bsb
Author
Hyderabad, First Published Feb 12, 2021, 4:19 PM IST

ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ కుంభకోణం కేసులో ఆ బ్యాంక్ మాజీ సీఎండీ చందా కొచర్‌కు ఊరట లభించింది. ఈ కేసులో చందాకొచర్ కు ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు  బెయిల్‌ మంజూరు చేసింది. విచారణకు హాజరైన ఆమెకు రూ. 5 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. 

కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు ఈ ఏడాది జనవరి 30న చందా కొచర్, ఆమె భర్త దీపక్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. 

ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఎండీ చందా కొచర్‌ బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేస్తే పైన చెప్పిన విధంగా తీర్పు నిచ్చింది. 

కాగా ఐసీఐసీఐ స్కాంలో చందా కొచర్‌కు వీడియోకాన్ గ్రూప్ కు రూ.3,250 కోట్ల రుణం మంజూరులో క్విడ్ ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు చందా కొచర్ నేతృత్వంలోని బ్యాంక్ ప్యానెల్ మంజూరు చేసిన రూ. 300 కోట్ల రుణ మొత్తంలో రూ. 64 కోట్లు వీడియోకాన్ ఇండస్ట్రీస్ ను 
పవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌పిఎల్)కు బదిలీ అయినట్టు ఈడీ ఆరోపించింది. 

ఈ కేసులో ఆమె భర్త దీపక్ కొచర్ పై మనీ లాండరింగ్ కింద కేసులు నమోదయ్యాయి. 2019లో సీబీఐ కేసు నమోదు చేయగా, 2020లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది. ఈనేపథ్యంలో 2020 సెప్టెంబర్‌లో చందా కొచర్‌ దంపతులను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios