భారత వైమానిక దళం 'వింగ్స్ ఆఫ్ గ్లోరీ' కారు ర్యాలీ ... ఏకంగా 7000 కి.మీ ప్రయాణమే!

భారత వాయుసేన యువతలో దేశభక్తిని నింపేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారతదేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను గుర్తుచేసుకుంటూ యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు వాయుసేన ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దాదాపు 7000 కిలోమీటర్ల దూరం హిమాలయాల్లోని సియాచిన్ మీదుగా అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వరకు కారు ర్యాలీ చేపడుతోంది.  

IAF Wings of Glory Car Rally: A 7000km Journey from Thoise to Tawang AKP

భారత  వైమానిక దళం (IAF) ఇప్పటికే దేశ రక్షణ చేపడుతోంది. ఇలా శతృవుల నుండి దేశాన్ని కాపాడటమే కాదు యువతలో దేశభక్తిని నింపి భారత సైన్యం వైపు నడిపించే బాధ్యత కూడా తీసుకుంది. ఇలా దేశ యువతరాన్ని ఆకర్షించే ఉద్దేశ్యంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక చొరవ తీసుకుని సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చల్లని హిమాలయ ప్రాంతాన్ని చుడుతూ ఏకంగా 7000 కిలో మీటర్ల కారు ర్యాలీని చేపడుతోంది. భారత సైనికుల గొప్పతనాన్ని గుర్తుచేస్తూ ఈ కారు ర్యాలీ సాగనుంది.  

ఐఎఎఫ్ కారు ర్యాలీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే : 

యువతను భారత వైమానిక దళంలో చేరడానికి ప్రోత్సహించడంతో పాటు రక్షణ రంగంలో ఎయిర్ వారియర్స్ చేసిన వీరోచిత చర్యలను, రెస్క్యూ ఆపరేషన్లలో వారి పాత్రను ప్రపంచానికి తెలియజేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం. 1948లో కాశ్మీర్ ఆపరేషన్ నుండి 1965, 1971, 1999 యుద్ధాలు, బాలాకోట్ దాడి, కేదార్‌నాథ్ రక్షణ చర్యలు వరకు జరిగిన ఎన్నో విజయగాథలను ఈ ర్యాలీలో మళ్ళీ వివరిస్తారు.

ఎయిర్ వారియర్ వీరుడు, పరంవీర్ చక్ర అవార్డు గ్రహీత నిర్మల్ జిత్ సింగ్ సేఖన్, అంతరిక్ష యాత్రికుడు రాకేష్ శర్మ, కార్గిల్ వీరుడు స్క్వాడ్రన్ లీడర్ అజయ్ ఆహూజా వీరోచిత పోరాటం గురించి ఈ ర్యాలీలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు.

వాయుసేన కారు ర్యాలీ ఇలా సాగనుంది

వాయు వీర్ విజేత ఐఎఎఫ్-యూడబ్యూఎం కార్ ర్యాలీకి అక్టోబర్ 1న జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఘనంగా వీడ్కోలు పలుకుతారు. అక్టోబర్ 8న వాయుసేన దినోత్సవం సందర్భంగా థోయిస్ (సియాచిన్‌కు వెళ్ళే భారతీయ సైనికుల తాత్కాలిక విడిది) లో తిరిగి ప్రారంభం అవుతుంది. సముద్ర మట్టానికి 3068 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వాయు స్థావరాలలో ఒకటైన థోయిస్‌లో ఈ ర్యాలీని అధికారికంగా జెండా ఊపి ప్రారంభిస్తారు. అక్టోబర్ 9న లదఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బ్రిగేడియర్ బి.డి. మిశ్రా లేహ్‌లోని పోలో గ్రౌండ్స్‌లో వాయు యోధుల కార్ ర్యాలీకి స్వాగతం పలుకుతారు. అక్కడ ప్రత్యేక కార్యక్రమం అనంతరం తదుపరి ప్రయాణానికి జెండా ఊపుతారు.

ఈ ర్యాలీని హిందీలో వాయు వీర్ విజేత ర్యాలీ అని పిలుస్తారు. దీనికి హిమాలయన్ థండర్, వింగ్స్ ఆఫ్ గ్లోరీ కారు ర్యాలీగా కూడా పిలుస్తారు. ఈ కారు ర్యాలీ పదహారు చోట్ల ఆగుతుంది..  ఇరవై కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు,యువతన కలుస్తుంది. వివిధ ప్రధాన నగరాల్లో ఉన్నతాధికారుల, నాయకులు. ప్రజల నుండి గౌరవాన్ని స్వీకరిస్తుంది. ఇలా సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆరవ దలైలామా జన్మస్థలం, టిబెట్ వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ మఠం కలిగిన తవాంగ్ లో ముగుస్తుంది.

 ఈ ర్యాలీలో 52 మంది వాయు యోధులు డ్రైవర్లు, సహాయక డ్రైవర్లుగా వ్యవహరిస్తారు...వీరిలో అనేక మంది మహిళా అధికారులు కూడా వున్నారు., అందరూ వాయుసేనకు చెందినవారే. వివిధ దశల్లో ముగ్గురు మాజీ వాయుసేన చీఫ్ లు ఈ కారు ర్యాలీలో పాల్గొంటారు. కార్గిల్ యుద్ధ సమయంలో వాయుసేనకు నాయకత్వం వహించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అనిల్ తిప్నిస్, ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా ర్యాలీకి మెంటార్‌లుగా ఉండటానికి సిద్దమయ్యారు. వీరు మారుతి సుజుకి అందించిన జిమ్నీ వాహనాలను నడపాలనే కోరికను వ్యక్తం చేశారు.

భారతీయ వాయుసేన యొక్క అడ్వెంచర్ విభాగం ఈ ర్యాలీని సమన్వయం చేస్తుంది. గ్రూప్ కెప్టెన్ నమిత్ రావత్ ఢిల్లీలోని "ర్యాలీ వార్ రూమ్"ను నిర్వహిస్తారు. ఇక వింగ్ కమాండర్ విజయ్ ప్రకాష్ భట్ మొత్తం ర్యాలీని పర్యవేక్షిస్తారు. 

ఐఎఎఫ్ కారు ర్యాలీకి మద్దతిస్తున్నది వీళ్లే :

  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ యొక్క రహదారులు మరియు రవాణా మంత్రిత్వ శాఖ ర్యాలీలో ప్రధాన భాగస్వామి (NHAI DCL ద్వారా). యుద్ధ విమానాల ల్యాండింగ్ ఎయిర్‌ఫీల్డ్‌ల మాదిరిగా వున్న రహదారులను ప్రదర్శించడానికి ఆసక్తిగా ఉన్నారు. కేంద్ర యువజన,క్రీడా మంత్రి   మన్సుఖ్ మాండవియా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద జెండా ఊపి ఈ కారు ర్యాలీని ప్రారంభించి మద్దతుగా నిలుస్తారు. 

కఠినమైన కొండ ప్రాంతాల్లో ప్రయాణానికి అనువైన వాహనాలను తయారుచేయడంలో మారుతి సుజుకి ముందుంది. ఈ హిమాలయన్ థండర్ ర్యాలీకి కూడా ఈ కంపనీకి చెందిన జిమ్ని వాహనాలను అందించింది. నవంబర్ 13 నాటికి ఈ ర్యాలీ దేశ రాజధాని ఢిల్లీకి వస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమం కోసం జాతీయ నాయకులు, సైనికాధికారులను ఆహ్వానించారు.

మాజీ నావికాదళ చీఫ్, ప్రస్తుతం అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ డి కె జోషి, ఎయిర్ మార్షల్ బిడి జయల్, బ్రిగేడియర్ ఆర్ఎస్ రావత్, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, మాజీ ఎంపీ తరుణ్ విజయ్ (చైర్మన్) తదితరులు అతిపెద్ద వాయుసేన కార్ ర్యాలీని ప్రారంభించినందుకు వాయుసేన చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్. చౌదరి, కొత్త చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios