తాను సైలెంట్ ప్రధానిని కాదన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. మీడియాతో మాట్లాడటానికి ప్రధానిగా తాను ఎప్పుడూ వెనుకంజ వేయలేదన్నారు. కేంద్రం-ఆర్‌బీఐలది భార్యాభర్తల సంబంధమని మన్మోహన్ గుర్తు చేశారు.

తాను సైలెంట్ ప్రధానిని అనుకున్న వాళ్లు అమాయకులన్నారు. తాను యాక్సిడెంటల్ ప్రధానినే కాదు.. యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్‌ను కూడా అని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఐజీ పటేల్ నిరాకరించడం వల్లే నాడు ఆర్థిక శాఖను పీవీ నరసింహారావు తనకు కేటాయించారని మన్మోహన్ సింగ్ గుర్తుచేశారు.