దేశ వాణిజ్య రాజధాని ముంబైలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది మృతి చెందారు. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాల వారిని క్షమాపణలు కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని ఉద్ధవ్ హామీ ఇచ్చారు. మృతుల్లో ఎక్కువ మంది వెంటిలేటర్‌పై ఉన్నవారేనని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పది మంది మృతిచెందారు. 23 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

నగరంలో కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఓ ప్రైవేటు షాపింగ్ మాల్‌ను కరోనా ఆస్పత్రిగా మార్చారు. అందులో 76 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. గురువారం అర్ధరాత్రి భాండూప్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మంటల ధాటికి ఆస్పత్రిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఊపిరాడక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే అప్రమత్తమై అధికారులు రోగులను వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి వుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.