భార్యను స్వయంగా ప్రియుడికి అప్పగించిన భర్త.. కొన్నాళ్లకు..భర్త, కూతురు గుర్తొస్తున్నారనడంతో..
ఈ విషయం ఆమె ప్రేమికుడికి తెలియడంతో వారిద్దరి మధ్య వివాదం నెలకొంది. ఇది మహిళా పోలీస్ స్టేషన్ కు చేరడంతో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఫలితంగా ఆ మహిళ తన ప్రియునితోనే ఉండేందుకు రాజీ పడింది.
ఉత్తరప్రదేశ్ : కొందరి వైవాహిక జీవితంలో(Marrital life) ఊహించని మలుపులు ఎదురవుతుంటాయి. అవి చూసేవారికి ఆసక్తికరంగా కనిపిస్తాయి. కానీ ఆ బాధను ఎదుర్కొనే దంపతులకు ఆ సమయంలో జీవితంలో కఠిన పరీక్ష ఎదురైనట్లు అనిపిస్తుంది. యూపీలోని మురాదాబాద్ జిల్లా(moradabad) మఝోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక భర్త.. తన భార్యను.. ఆమె ప్రియుని చెంతకు(lover house) చేర్చాడు. అయితే, ఆ ప్రేమికుడితో ఎనిమిది నెలలు కలిసి ఉన్న ఆమెకు.. తిరిగి తన భర్తతో పాటు కుమార్తె గుర్తుకు వచ్చారు.
ఈ విషయం ఆమె ప్రేమికుడికి తెలియడంతో వారిద్దరి మధ్య వివాదం నెలకొంది. ఇది మహిళా పోలీస్ స్టేషన్ కు చేరడంతో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఫలితంగా ఆ మహిళ తన ప్రియునితోనే ఉండేందుకు రాజీ పడింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం... మఝోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహిళకు అదే ప్రాంతానికి చెందిన ఒక యువకునితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి అనంతరం వారి వైవాహిక జీవితం సవ్యంగానే సాగింది. ఈ నేపథ్యంలో ఆమె ఒక బాలికకు కూడా జన్మనిచ్చింది.
కొన్నాళ్ళకు ఆ మహిళ ఎవరికో ఫోన్ చేస్తుండటం ఆమె భర్త గమనించాడు. అతను భార్యను నిలదీసేసరికి ఆమె ఏవో విషయాలు చెబుతూ మాట దాటవేసింది. అయితే మరోమారు ఆమె ఇదే విధంగా ఫోన్లో మాట్లాడుతుండగా భర్త ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.
ఇంగ్లాండ్‌కు భారత్ గట్టి కౌంటర్.. యూకే పౌరులందరికీ తప్పనిసరి క్వారంటైన్
దీంతో ఆమె తనకు పెళ్ళికి ముందు నుంచి ఒక యువకుడితో పరిచయం ఉన్న విషయాన్ని వెల్లడించింది. ఈ విషయం తెలియగానే భర్త ఆమెను ఎనిమిది నెలల క్రితమే ప్రేమికుని దగ్గరికి చేర్చాడు. అప్పటినుంచి భార్యతో సంబంధం వదులుకున్నాడు. అయితే ఇటీవల ఆమె తిరిగి భర్తతో ఫోన్లో మాట్లాడుతుండడాన్ని ఆమె ప్రేమికుడు గమనించాడు.
దీంతో అతను ప్రశ్నించడంతో.. ఆమె, తనకు భర్త, కూతురు గుర్తుకు వస్తున్నారు అని చెప్పింది. ఫలితంగా వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అతను ఆమెపై చేయి చేసుకున్నాడు. ఈ వివాదం పోలీస్‌స్టేషన్ వరకు చేరింది. అక్కడ ఆమెకు, ఆమె ప్రియుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరికి ఆమె ప్రియుడితోనే ఉండేందుకు రాజీ పడింది. అలాగే భర్తతో ఇకపై మాట్లాడనని కూడా తెలిపింది.