ఓ వ్యక్తి ఇంట్లోకి పాము ప్రవేశించింది. ఇంట్లోని టేబుల్ కింద పాము నక్కి ఉండటం గమనార్హం. అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు దానిని బంధించారు. 

ఆమడ దూరంలో పాము కనిపిస్తేనే భయంతో వణికిపోతాం. అమాంతం అక్కడి బయటకు పరుగులు తీస్తాం. అలాంటిది అతి పెద్ద పాము.. అందులోనూ విషపూరితమైనది ఇంట్లోకి వస్తే.. ఇంకేమైనా ఉందా..? ఇలాంటి సంఘటనే ఓ కుటుంబానికి ఎదురైంది. కాగా.. ఆ ఇంట్లో కి వచ్చిన పాముని చాకచక్యంగా బంధించగా.. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Scroll to load tweet…

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి పాము ప్రవేశించింది. ఇంట్లోని టేబుల్ కింద పాము నక్కి ఉండటం గమనార్హం. అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు దానిని బంధించారు. ఈ క్లిప్‌ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ ఆకాష్ కుమార్ వర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

కాగా.. ఆ వీడియోలో పాముని పట్టుకునేందుకు ఓ వ్యక్తి టేబుల్ కిందకు దూరాడు. అనంతరం దానిని పట్టుకొని ఇంటి టెర్రపైన ఉన్న సంచిలో వేశాడు. ఈ క్రమంలో పాము అతని మెడను కూడా చుట్టుకుంది. వీడియో చూస్తే ఒళ్లు జలదరించకమానదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. పామును సంచిలో నుంచి బయటకు వదిలినప్పుడు అది అడవిలోకి వెళ్లడం కూడా చూపించారు. ప్రపంచంలో ఉన్న అన్ని పాముల కంటే కింగ్‌ కోబ్రా చాలా విషపూరితమైనది.