పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టారు కార్మికులు. 

గుజరాత్ : మంగళవారం తెల్లవారుజామున గుజరాత్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుజరాత్ లోని ఖచ్ జిల్లా బుధామోర్ లో ఉన్న ఓ పరిశ్రమలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ముగ్గురు కార్మికులు సజీవదహనం అయ్యారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టారు కార్మికులు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred