అంతర్జాతీయ సంక్షోభం వేళ స్థిరంగా భారత ఆర్థిక వ్యవస్థ... మోదీకి ఎలా సాధ్యమయ్యింది?
అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్న భారత ఆర్థిక వ్యవస్ధ మాత్ర స్థిరంగా వుంటోంది. మోదీ సర్కార్ కు ఇది ఎలా సాధ్యమయ్యిందంటే...
Indian Economy : ప్రపంచంలో ఎక్కడో జరిగే పరిణామాలు మరొక్కడో ప్రభావం చూపుతుంటాయి. ఆ పరిణామాలతో ఏమాత్రం సంబంధంలేకపోయినా ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ముఖ్యంగా దేశాల మధ్య యుద్దవాతావరణం ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలనే కాదు ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తాయి. ఇలా రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్దంతో అనేక దేశాలు ఇబ్బందిపడ్డాయి.
ప్రపంచ దేశాలన్నింటికి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ద వాతావరణం పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. కానీ భారత్ ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా వుంచుకోగలిగింది. ఈ యుద్ద ప్రభావం ఎక్కువగా భారత్ పైనే వుంటుందని అనుకుంటే... మోదీ సర్కార్ ఆ పరిస్థితి రానివ్వలేదు. దీంతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
ఉక్రెయిన్ తో యుద్దం నేపథ్యంలో యురోపియన్ యూనియన్ దేశాలు రష్యానుండి చమురు దిగుమతిని ఆపేసాయి. దీంతో చమురుకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రపంచ దేశాల మాదిరిగానే భారత్ ప్రభావం పడింది.
ఈ పరిస్థితుల్లో మోదీ సర్కార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత స్థిరంగా వుంచాయి. ప్రపంచ దేశాల ఆంక్షాల మధ్య కూడా రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుంది భారత్. ఈ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా మారింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్దంతో అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరిగాయి. కానీ భారత్ మాత్రం రష్యా నుండి చాలా తక్కువ ధరకు చమురు దిగుమతిని కొనసాగించింది. దీంతో ప్రపంచ దేశాలు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు భారత్ కు ఎదురుకాలేదు. అంతేకాదు దేశంలో చమురు ధరలు పెరగలేదు.