Asianet News TeluguAsianet News Telugu

పిజ్జాలో పురుగులు.. మూడేండ్ల త‌రువాత‌ రూ. 7000 పరిహారం 

పాడైన పిజ్జా డెలివ‌రీ చేసి.. ఓ వ్య‌క్తి అస్వ‌స్థ‌త‌కు కార‌ణ‌మైన  సదరు పిజ్జా షాప్‌ యజమానికి కోర్టు షాకిచ్చింది. కస్టమర్‌కు రూ.7 వేల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 

Hoshiarpur man moves court over worm-ridden pizza, awarded  7,000 compensation
Author
First Published Oct 4, 2022, 6:50 AM IST

ఓ వ్యక్తి మంచి మంచి ఆకలితో ఉన్నాడు. ఇంట్లో తిన్న‌డానికి ఏమి లేకపోవ‌డంతో హాట్ హాట్ గా ఓ పిజ్జా తినాల‌ని భావించాడు. దీంతో వెంట‌నే.. పిజ్జా ఆర్డర్ పెట్టాడు. నిమిషాల్లో పిజ్జా డెలివ‌రీ వ‌చ్చింది. మంచి ఆక‌లి.. న‌చ్చిన పిజ్జా ప‌క్క‌నే ఉంది. ఇంకేముంది.. ఓ ప‌ట్టుప‌ట్టాల్సిందేన‌ని అనుకున్నాడు. పిజ్జాలో ఓ ముక్క తీసుకుని బైట్ చేశాడు. కానీ, టేస్ట్ చాలా డిఫిరెంట్ గా ఉంది.  తీరా.. ప‌రిశీలించి చూడ‌గా.. షాకయ్యాడు.

ఒక్క‌సారిగా కంగుతిన్నాడు. పిజ్జా బ‌య‌ట‌కు చాలా బాగున్నా..  లోప‌ల మాత్రం తెల్లని పురుగులు ఉన్నాయి. వెంటనే సదరు పిజ్జా షాపు నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. కానీ..  ఆ షాపు మేనేజర్ ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. ఆ వ్య‌క్తి అంత‌టితో ఆగ‌కుండా.. వినియోగదారుల కోర్టుకు ఫిర్యాదు చేశాడు. దాదాపు మూడేళ్ల పోరాటం త‌రువాత .. ఆ కోర్టు స‌ద‌రు వ్య‌క్తికి రూ.7,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

వివరాల్లోకెళ్తే.. హరియాణాలోని హోషియార్‌పూర్ నివాసి హర్‌కీరత్ సింగ్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. గ‌త మూడేండ్ల కిత్రం (జూలై 14, 2019న).. హర్కీరత్ సింగ్ .. ఉబర్ ఈట్స్ యాప్  ద్వారా "రెగ్యులర్ క్లాసిక్ పనీర్ పిజ్జా విత్ ఆనియన్ కాంబో"ని ఆర్డర్ చేసారు. ‘కెప్టెన్ శామ్స్’ పిజ్జా చైన్ నుంచి ఈ ఆర్డర్ వచ్చింది. పిజ్జా తింటున్నప్పుడు.. అతనికి తెల్ల పురుగులు, వెంట్రుకలను చూసి షాక్ అయ్యాడు. అతని స్నేహితుడికి కూడా కనిపించాయి. ఆత‌డు వెంట‌నే పిజ్జా ప్లేస్‌కి కాల్ చేసింది, కానీ స్టోర్ మేనేజర్.. అర్థ‌ప‌ర్థం లేని స‌మాధానం ఇచ్చాడు. జనరల్ మేనేజర్ కూడా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. అదే రోజు సాయంత్రం.. అతను తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. కడుపు నొప్పి, మోష‌న్స్ బాధ‌ప‌డ్డాడు. 

చికిత్స అనంతరం హర్‌కీరత్.. కెప్టెన్ సామ్‌కు ఈ-మెయిల్ పంపాడు, కానీ ఈ-మెయిల్ చిరునామా తప్పు. అనేక సందర్భాల్లో ఉన్నప్పటికీ, ఉబెర్ ఈట్స్ మరియు కెప్టెన్ సామ్ ఇద్దరూ తమ సమాధానాలు మరియు సాక్ష్యాలను ఫైల్ చేయడంలో విఫలమయ్యారు. అంత‌టితో ఆగ‌లేదు. తన ఫిర్యాదు తీసుకొని కన్జూమర్ కోర్టును ఆశ్రయించాడు. 

 "Uber Eats ,కెప్టెన్ సామ్ ల చర్యను కోర్టు తీవ్రంగా  వ్యతిరేకించింది. ఫిర్యాదులో చేసిన ఆరోపణలకు వారి రక్షణలో వారు ఏమీ చెప్పలేరని నిర్ధారించారని వినియోగదారుల ఫోరమ్ తెలిపింది. బాధిత వ్య‌క్తికి Uber Eats, కెప్టెన్ సామ్ కలుషితమైన ఆహారాన్ని అందించారు. దీంతో అత‌డు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. చిక్సిత పోందాల్సి వ‌చ్చింది. దాని ఫలితంగా ఆమె మానసిక వేదనతో పాటు శారీరక వేధింపులను ఎదుర్కొన్నాడని ఫోరమ్ పేర్కొంది.  బాధిత వ్య‌క్తికి  ఏడు వేల రూపాయాల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని ఆదేశించింది.  చండీగఢ్ పిజ్జా చైన్ కెప్టెన్ సామ్స్, ఫుడ్ డెలివరీ యాప్ ఉబెర్ ఈట్‌లను ఆర్డర్ సర్టిఫైడ్ కాపీ అందిన 45 రోజులలోపు మొత్తాన్ని చెల్లించాలని లేదా చెల్లింపు జరిగే వరకు 12% వడ్డీని చెల్లించాలని ఆదేశించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios