ఘోరం.. పెళ్లి క్యాన్సిల్ చేసిందని 17 ఏళ్ల బాలికను కత్తితో పొడిచిన మాజీ ప్రియుడు.. (వీడియో)
కేరళలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోజికోడ్ జిల్లాలోని నాదపురం ఓల్డ్ మార్కెట్ లో ఓ యువకుడు 17 ఏళ్ల బాలికపై కత్తితో దాడి చేశాడు. పెళ్లిని రద్దు చేసిందనే కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

17 ఏళ్ల బాలిక 28 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా భావించారు. ఇరు కుటుంబాల పెద్దల వారి పెళ్లికి ఒప్పుకున్నారు. కొన్ని నెలల కిందట వివాహాన్ని నిశ్చయించారు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ ఆ బాలిక పెళ్లి రద్దు చేసింది. తనకు అతడితో పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. దీనిపై కోపం పెంచుకున్న అతడు అందరూ చూస్తుండగానే ఆ బాలికపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. కోజికోడ్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువకుడు అర్షద్ 17 ఏళ్ల బాలికకు కొన్ని నెలల కిందట పెళ్లి నిశ్చయం అయ్యింది. అంతకు ముందు వారు ప్రేమించుకున్నారు. కానీ ఆ యువతి ఆ పెళ్లి క్యాన్సిల్ చేసింది. దీంతో ఆమెపై మాజీ ప్రియుడు కోపం పెంచుకున్నాడు. అయితే ఆ బాలిక ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం నాదపురంలోని ఓల్డ్ మార్కెట్ కు వచ్చింది.
దీంతో ఎప్పటి నుంచో ఆగ్రహంగా ఉన్న ఆ యువకుడు ఆ బాలికను చూసి కత్తి తీసుకొని వెంబడించాడు. ఆ బాలిక తప్పించుకునేందుకు పలు దుకాణాల్లో పరిగెత్తుకెళ్లింది. ఓ ప్రాంతంలో ఆ బాలికను పట్టుకొని కత్తితో పొడిచాడు. దీంతో ఓ దుకాణ యజమాని అతడిని అడ్డుకున్నాడు. అతడి చేతికి గాయాలు అయ్యాయి. అదే సమయంలో స్థానికులంతా చేరుకొని ఆ యువకుడిని నిలువరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
కాగా.. ఈ ఘటనలో బాలిక చేతికి గాయాలు కావడంతో ఆమెను హాస్పిటల్ కు తరలించారు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ బాలిక పెళ్లి రద్దు చేసిన నాటి నుంచి నిందితుడు ఆమె కుటుంబాన్ని బెదిరించేవాడని స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఆ బాలిక కుటుంబం మొత్తం వేరే ఇంటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం బాలిక ప్రమాదం నుంచి బయటపడింది. చేతికైన గాయాలకు ఆమె చికిత్స పొందుతోంది.