Asianet News TeluguAsianet News Telugu

మోడీ కేబినెట్‌లో సహాయ మంత్రిగా పని చేయడం నాకు దక్కిన గౌరవం: రాజీవ్ చంద్రశేఖర్

కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ప్రమాణ స్వీకారం అనంతరం రాజీవ్ చంద్రశేఖర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ గత 15 సంవత్సరాలుగా ఎంపీగా దేశానికి నా సేవలందిస్తున్నానని తెలిపారు. సుసంపన్నమైన, వైవిధ్యమైన భారతదేశాన్ని నిర్మించడం కోసం కృషి చేస్తున్న మోడీ కేబినెట్‌లో సహాయ మంత్రిగా పనిచేయడం తనకు దక్కిన గౌరవం ’’ అని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. 

Honoured to be a part of PM Modis team says Rajeev Chandrasekhar ksp
Author
New Delhi, First Published Jul 7, 2021, 9:44 PM IST

కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ప్రమాణ స్వీకారం అనంతరం రాజీవ్ చంద్రశేఖర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ గత 15 సంవత్సరాలుగా ఎంపీగా దేశానికి నా సేవలందిస్తున్నానని తెలిపారు. సుసంపన్నమైన, వైవిధ్యమైన భారతదేశాన్ని నిర్మించడం కోసం కృషి చేస్తున్న మోడీ కేబినెట్‌లో సహాయ మంత్రిగా పనిచేయడం తనకు దక్కిన గౌరవం ’’ అని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. 

కాగా, మోడీ కాబినెట్ విస్తరణలో కేంద్ర మంత్రివర్గంలో రాజీవ్ చంద్రశేఖర్ కి అవకాశం దక్కింది. 43 మందితో జరిపిన కేబినెట్ విస్తరణలో రాజీవ్ చంద్రశేఖర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. రాజ్య సభ ఎంపీగా కొనసాగుతున్న రాజీవ్ చంద్రశేఖర్ రాజకీయాల్లోకి వచ్చేముందు భారతదేశంలో మొబైల్ విప్లవానికి తొలి అడుగులు వేసిన అతి కొద్ది మందిలో ఒకరు. భారత్ లో బీఈ పూర్తిచేసుకొని అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసారు రాజీవ్ చంద్రశేఖర్. 

సిలికాన్ వాలీ లో మైక్రోప్రాసెసర్ డేసిగ్నేర్ గా పనిచేసిన రాజీవ్... 1991లో భారతదేశంలో బీపీఎల్ మొబైల్ ని స్థాపించారు. ఆ కాలంలో దేశంలోనే అతి పెద్ద సెల్యూలర్ నెట్వర్క్ ని ఏర్పాటుచేశారు. 2006 వరకు ఇదే రంగంలో ఉన్న ఆయన ఆ తరువాత రాజా టెలికాం మంత్రిగా తన రాజ్ చెలాయిస్తుండడంతో ఈ రంగం నుంచి బయటకు వచ్చేసారు. 

అక్కడి నుండి బయటకు వచ్చేసి 2006లోనే జూపిటర్ కాపిటల్ సంస్థను ఏర్పాటుచేశారు. 2014 వరకు దానికి చైర్మన్ గా వ్యవహరించారు. అనేక మీడియా,టెక్నాలజీ,ఇన్ఫ్రా రంగాల్లో అనేక విజయవంతమైన బ్రాండ్స్ లో ఆయన ఇన్వెస్ట్ చేసారు, కొన్నిటిని నెలకొల్పారు కూడా..!

2006లోనే ఆయన తొలిసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా మూడవ పర్యాయం కొనసాగుతున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా సేవలందిస్తున్న రాజీవ్ చంద్రశేఖర్ వివిధ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లోనూ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్,సెంటర్ అఫ్ ఎకనామిక్ స్టడీస్ లకు చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. 

2007లో అప్పట్లో సంచలనం సృష్టించిన 2జి స్కాం గురించి పార్లమెంటులో తన గళాన్ని వినిపించిన మొదటి ఎంపీ ఈయనే. ఈయన కృషి వల్లనే 3జి స్పెక్ట్రమ్ వేలం వేసింది ప్రభుత్వం. తద్వారా 2జి ని ఉచితంగా ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందనేది ప్రజల ముందు ఉంచగలిగారు. 

కేవలం 2జి స్పెక్ట్రమ్ విషయంలోనే కాకుండా, ఆధార్ ను రూపొందించడంలో అప్పటి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని వాదించారు. ఆ తరువాత వీరు సూచించిన మార్పులన్నీ చేసినతరువాత మోడీ హయాంలో ఈ మార్పులను చేయడం జరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios