Asianet News TeluguAsianet News Telugu

ఆస్పత్రిలో చేరిన హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్.. వివరాలు ఇవే..

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఆస్పత్రిలో చేరారు. 

Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu Admitted To Hospital For Stomach Infection ksm
Author
First Published Oct 26, 2023, 2:09 PM IST | Last Updated Oct 26, 2023, 2:09 PM IST

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఆస్పత్రిలో చేరారు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా సుఖ్విందర్ సింగ్ సుఖు సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (ఐజిఎంసీ)లో చేరినట్లు అధికారులు గురువారం తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. 

‘‘కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖును ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఐజీఎంసీ)లో చేర్చారు. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ నార్మల్‌గా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మేము ఆయనకు అన్ని వైద్య పరీక్షలు చేశాం. రిపోర్ట్స్ సాధారణంగా ఉన్నాయి’’ అని ఐజీఎంసీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలోనే సుఖ్విందర్ సింగ్ సుఖుకు తదుపరి పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios