నిజంగా సాధించాలనే పట్టుదల ఉంటే.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదురించడానికి సిద్దం కావచ్చని ఓ యువకుడు నిరూపించాడు. తన పరిస్థితి తన కలకు ఆటంకం కలిగించకూడదని తన శక్తిమేర ప్రయత్నిస్తున్నాడు.

జీవితంలో చాలా మందికి చాలా కలలు ఉంటాయి. అయితే.. ఆ కలలను చాలా కొద్ది మంది మాత్రమే నెరవేర్చుకోగలుగుతారు. చాలా మంది.. తమ ఆర్థిక పరిస్థితి, ఇతర పరిస్థితుల కారణంగా.. తాము అనుకున్నది సాధించలేకపోయామని.. ఇలా కాంప్రమైజ్ అయ్యి జీవితం సాగిస్తున్నామంటూ ఏవేవో సాకులు చెబుతుంటారు. అయితే.. నిజంగా సాధించాలనే పట్టుదల ఉంటే.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదురించడానికి సిద్దం కావచ్చని ఓ యువకుడు నిరూపించాడు. తన పరిస్థితి తన కలకు ఆటంకం కలిగించకూడదని తన శక్తిమేర ప్రయత్నిస్తున్నాడు. కాగా.. ఆ యువకుడి కథకు.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఫిదా అయిపోయాడు. అతని కథను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రదీప్‌ మెహ్రాది పేద కుటుంబం. నోయిడాలో తన సోదరుడితో కలిసి ఉంటూ.. మెక్‌ డోనాల్డ్స్‌లో పని చేస్తున్నాడు. ప్రదీప్‌ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన అమ్మకు అయ్యే ఖర్చు కోసం ప్రదీప్‌, అతడి సోదరుడు జాబ్ చేస్తున్నారు. ప్రదీప్‌ తను పని చేసే మెక్‌ డోనాల్డ్స్‌ నుంచి ఇంటికి 10 కిలోమీటర్ల దూరం. ప్రతిరోజు విధులు పూర్తయ్యాక తర్వాత అర్ధరాత్రి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో గత శనివారం అర్ధరాత్రి ప్రదీప్‌ పరుగెడుతుంటే.. బాలీవుడ్ డైరెక్టర్ వినోద్‌ కాప్రి కంటపడ్డాడు. కారును స్లో చేసి లిఫ్ట్‌ కావాలా అని అడగ్గా.. వద్దు అని చెప్పాడు.

Scroll to load tweet…

డైరెక్టర్ వినోద్‌ కాప్రి కారులో ఉండి ప్రదీప్‌ మెహ్రాను ప్రశ్నలు అడిగారు. వినోద్‌ కాప్రి అడిగిన ప్రశ్నలకు ప్రదీప్‌ పరుగెత్తుతూనే సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వీడియోను వినోద్‌ ఆదివారం సాయంత్రం తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసారు. 'ప్రదీప్‌ ఓ అద్భుతమైన వ్యక్తి. అతడి కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం' అని పేర్కొన్నారు. ఈ వీడియో పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే నెట్టింట వైరల్‌ అయ్యింది. కేవలం 12 గంటల్లోనే 4 లక్షల మంది వీడియోను చూశాను. ప్రదీప్‌ పట్టుదలను అందరూ కొనియాడుతున్నారు.

కాగా.. ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా.. ఫిదా అయిపోయాడు. తనకు ఈ రోజు ఇన్సిపిరేషన్ కలిగించిన వీడియో ఇది అని ఆయన పేర్కొన్నాడు. ఈ యువకుడు చాలా స్వతంత్రంగా ఎదగుతున్నాడని.. అందుకే.. పెద్ద డైరెక్టర్ వచ్చి రైడ్ ఆఫర్ చేసినా.. వద్దు అన్నాడని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం నెట్టింట ఈ యువకుడి వీడియో వైరల్ గా మారింది.