Asianet News TeluguAsianet News Telugu

హత్రాస్ ఘటన: సంచలన ఆరోపణలు చేసిన గ్రామ పెద్ద

హత్రాస్ ఘటనపై రోజుకో విషయం వెలుగు చూస్తోంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయమై హత్రాస్ గ్రామ పెద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
 

Hathras case: Victim's family objected to her relationship with accused; attacked by family, says village head lns
Author
Hathras, First Published Oct 7, 2020, 6:03 PM IST

లక్నో: హత్రాస్ ఘటనపై రోజుకో విషయం వెలుగు చూస్తోంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయమై హత్రాస్ గ్రామ పెద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

హత్రాస్ లో గ్యాంగ్ రేప్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 19 ఏళ్ల యువతి మరణించింది. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని  ఫోరెన్సిక్ నివేదిక  ఇచ్చింది.

మృతురాలితో పాటు నిందితుడికి మధ్య సంబంధాలు ఉన్నాయని  గ్రామ పెద్ద ఆరోపించాడు. వీరిద్దరూ తరచూ ఫోన్ లో సంభాషించుకొనేవారని ఆయన చెప్పాడు. 
ఈ సంబంధంపై బాధితురాలి కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారని ఆయన చెప్పాడు.

బాధితురాలికి ఫోన్ ఇచ్చేందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు వెళ్లిన సమయంలో  బాధిత కుటుంబం ఆమెపై దాడి చేసిందని ఆయన ఆరోపించాడు.ఈ దాడిలోనే ఆమె తీవ్రంగా గాయపడిందన్నారు.

హిందూమతంలో సామూహిక అత్యాచారానికి ఎవరూ కూడ పాల్పడరని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలో వారు నిందితులుగా తేలితే వారిని ఉరి తీయాలని ఆయన కోరారు. అయితే వారు ఈ ఘటనలో పాల్గొన్నట్టుగా తేలాల్సిన అవసరం ఉందన్నారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా కూడ నార్కో పరీక్షలకు కూడ సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు.బాలికను కలిసేందుకు వచ్చిన  యువకుడిని చూసిన  కుటుంబసభ్యులు ఆ బాలికపై దాడి చేశారని ఆయన తెలిపారు. 

బాధిత కుటుంబానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యుల నుండి పలుమార్లు ఫోన్ సంభాషణలు జరిగాయని  బీజేపీ ఆరోపించింది. బీజేపీ నేత అమిత్ మాలవీయా మంగళవారం నాడు ఈ విషయమై ఆరోపణలు చేశారు.  మృతురాలి సోదరుడిని ఈ విషయమై ప్రశ్నించాలని కోరారు.

మృతురాలి సోదరుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని బీజేపీ నేత ఆరోపించారు. మృతురాలి సోదరుడి ఫోన్ కాల్స్ రికార్డులను బయటపెడితే అసలు విషయాలు వెలుగు చూస్తాయన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios