హర్యానా రాష్ట్రంలోని ఓ ఫ్యాక్టరీలో విషపు వాయువులు వెలువడ్డాయి. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న మహిళా కార్మికులు ఆ విషపు వాయువులు పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.
హర్యానాలో (haryana)ని సోనిపట్ (sonipat)లోని ఓ ఫ్యాక్టరీలో విష వాయువులు పీల్చడం వల్ల 30 మంది మహిళా ఉద్యోగులు అస్వస్థకు గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పంచి గుజ్రాన్ గ్రామ సమీపంలోని బాద్‌షాహీ రోడ్డులో ఉన్న హ్యుందాయ్ మెటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ (Hyundai Metal Pvt Ltd factory )లో శనివారం చోటు చేసుకుంది.
ఈ ఘనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున కొలిమిలో కాపర్ స్క్రాప్
(copper scrap) కరిగించే సమయంలో విషపూరితమైన పొగలు వెలువడ్డాయి. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఎక్కువ మొత్తంలో కెమికల్స్ ఉపయోగిస్తారు. ఈ వాయువులు పీల్చిన సమయంలో అక్కడే ఉన్న మహిళ కార్మికులు అస్వస్థకు గురయ్యారు. అందులో 30 మంది అక్కడే స్పృహతప్పి పడిపోయారు. ఈ ఘటన జరిగిన సమయంలో వారంతా స్క్రాప్ మెల్టింగ్ ఫర్నేస్ (scrap melting furnace)దగ్గర పనులు చేస్తున్నారు.
అస్వస్థతకు గురైన కార్మికులందరినీ సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ (private hospital), గుణూర్ (Ganaur) లోని సీహెచ్ సీలో చేర్చారు. వారంతా ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమించడంతో వారిని ఖాన్‌పూర్ మెడికల్ కాలేజీ (Khanpur Medical College) కి తీసుకెళ్లారు. ఈ ఘటన సమాచారం అందడంతో పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకుని మహిళల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై ప్రస్తుతం గనూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
