Nusrat Mirza Row: పాకిస్థాన్ జర్నలిస్టు, ఐఎస్‌ఐ ఏజెంట్‌ నుస్రత్ మీర్జాను ఆహ్వానించాలనే వాదనను మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తిరస్కరించారు. బీజేపీ ఆరోపణలపై కూడా స్పందించారు. 

Nusrat Mirza Row: పాకిస్థాన్ జర్నలిస్టు, ఐఎస్‌ఐ ఏజెంట్ నుస్రత్ మీర్జాపై వివాదంపై మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ స్పందించారు. నుస్రత్ మీర్జాను భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించడంపై వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లను హమీద్ అన్సారీ తిరస్కరించారు. నుస్రత్‌ మిర్జాతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తాను ఎప్పుడు మిర్జాను భారత్‌కు ఆహ్వానించలేదని, తాను నుస్రత్ మీర్జాను ఎప్పుడూ కలవలేదని, భారత్‌కు రావాల్సిందిగా తనకు ఆహ్వానించ‌లేద‌ని అన్నారు. కావాల‌నే త‌న‌పై మీడియాలోని ఒక వర్గం, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

పాకిస్థాన్ జర్నలిస్టు నుస్రత్ మీర్జా వివాదంపై మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ.. నేనెప్పుడూ ఆయనను ఆహ్వానించలేదు, కలవలేదు. ఉపరాష్ట్రపతి విదేశీ అతిథిని ఆహ్వానించినప్పుడు ప్రభుత్వ సలహా మేరకే ఆహ్వానం అందజేస్తారని తెలుసుకోవాలని అన్నారు. ఇరాన్‌కు భారత దౌత్యవేత్తగా ఉన్నప్పుడు.. తాను దేశ ప్రయోజనాలు దెబ్బతినేలా వ్యహరించినట్టు నిఘా సంస్థ రా చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేద‌ని అన్నారు.

నుస్రత్ మీర్జాను పిలవలేదు

దేశ ద్రోహం విషయంపై 2010 డిసెంబర్ 11న ఉగ్రవాదంపై సదస్సును ప్రారంభించానని చెప్పారు. ఈ సమావేశం అంతర్జాతీయ ఉగ్రవాదం, మానవ హక్కుల గురించి చ‌ర్చ జ‌రిగింద‌ని తెలిపారు. అందులో ఆహ్వానితుల‌ను కూడా నిర్వ‌హ‌కులే పిలిచార‌నీ, తానేవ‌రిని పిలువ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. తానేప్పుడూ అతనికి ఫోన్ చేయలేదని, కలవలేదని తెలిపారు.

తన గురించి భారత ప్రభుత్వం ద‌గ్గ‌ర పూర్తి స‌మాచారముంద‌ని, తాను టెహ్రాన్‌లో పనిచేసిన తర్వాత, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యానని, అక్కడ త‌న‌ చేసిన పనికి దేశ విదేశాల్లో ఆమోదం లభించిందని తెలిపారు.

బీజేపీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, పాక్ ప్రయోజనాలు చేకూర్చినట్టు ఆధారాలు చూపించాలని అన్సారీ డిమాండ్‌ చేశారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న స‌మ‌యంలో తానెప్పుడు నుస్రత్‌ మిర్జాను భారత్‌కు ఆహ్వానించలేదని , ఢిల్లీలో ఆయనతో సమావేశం కాలేదని వివర‌ణ ఇచ్చారు. విదేశాంగశాఖ సూచించిన వ్యక్తులతోనే సమావేశమ‌య్యామ‌ని, తాను స్వయంగా ఎవరిని ఆహ్వానించ‌లేద‌ని అన్సారీ అన్నారు. ఉగ్రవాదంపై నిర్వహించిన సదస్సుకు మాత్రమే తాను హాజరయ్యార‌ని తెలిపారు.

బీజేపీ ఆరోపణ

అంతకుముందు.. నుస్రత్‌ మిర్జా జర్నలిస్ట్‌ ముసుగులో ఉన్న ఐఎస్‌ఐ ఏజెంటని బీజేపీ ఆరోపించింది. యుపిఎ ప్రభుత్వ హయాంలో తాను ఐదుసార్లు భారత్‌కు వచ్చి సమావేశమయ్యానని పాక్ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జా చేసిన వాదనపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్సారీ, కాంగ్రెస్‌లను వివరణ కోరారు. అప్పట్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న హమీద్‌ అన్సారీ ఆహ్వానం మేరకే నుస్రత్‌ మిర్జా భారత్ వచ్చాడని ఆరోపించడం గ‌మ‌నార్హం. ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌పై బీజేపీ స్పందించి.. భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్‌ఐకి అందించార‌ని బీజేపీ ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్‌తో పాటు హమీద్‌ అన్సారీ జవాబు చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.