న్యూఢిల్లీ: చిన్న వ్యాపారులకు జీఎస్టీ నుండి విముక్తి లభించింది. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారులను రూ.20 లక్షల నుండి రూ.40 లక్షలకు పెంచుతూ గురువారం నాడు నిర్ణయం తీసుకొన్నారు.

కాంపొజిషన్ పథకం కింద ఉండే పరిమితిని కోటి రూపాయాల నుండి రూ.1.5 కోట్లకు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. జీఎస్టీ కౌన్సిల్  సమావేశం గురువారం నాడు జరిగింది.

చిన్న, మధ్యతరహా పరిశ్రమల వ్యాపారులకు లాభం చేకూరేలా పలు నిర్ణయాలు తీసుకొన్నారు. కాంపొజిషన్ పథకం కింద వ్యాపారులు ప్రతి మూడు మాసాలకు ఓసారి పన్నులు చెల్లించాలి. అయితే ఏడాదికి ఒక్కసారి మాత్రమే రిటర్న్స్ ఫైల్ చేయాలి. కాంపొజిషన్ పథకం పరిమితిని కోటి రూపాయాలను కోటిన్నరకు పెంచారు.

ఈ విధానం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి వస్తోంది.  చిన్న, మధ్య తరహా వ్యాపారుల పన్ను విధింపు పరిమితిని రూ.20లక్షల వార్షిక టర్నోవర్‌ను రూ.40లక్షల వరకు పెంచారు.  గత నెలలోనే  జరిగిన  సమావేశంలో 23 వస్తువులను తక్కువ పన్ను శ్లాబులోకి తీసుకొచ్చారు.