గుండెజబ్బుతో చావుబతుకుల మధ్య ఉన్న మనవరాలి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకోవాల్సింది పోయి.. ఆ చిన్నారిపైనే అత్యాచారయత్నం చేయబోయాడు ఓ తాత.
గుండెజబ్బుతో చావుబతుకుల మధ్య ఉన్న మనవరాలి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకోవాల్సింది పోయి.. ఆ చిన్నారిపైనే అత్యాచారయత్నం చేయబోయాడు ఓ తాత. మరాఠ్వాడలోని హింగోలికి చెందిన ఓ చిన్నారి తల్లి మరణించడంతో ఆమె అనాథగా మారింది. దీంతో బంధువులు ఆ పాపను అనాథాశ్రమంలో చేర్పించారు.
అయితే ఆమెకు గుండెలో రంధ్రం పడటంతో శస్త్రచికిత్స కోసం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి... చిన్నారి తాతకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీ రాత్రి వార్డులో ఎవ్వరూ లేని సమయంలో తాతయ్య.. పాపను అసభ్యంగా తాకుతూ.. అత్యాచారయత్నం చేయబోయాడు.
ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు.. నర్సు వచ్చి ఏం జరిగిందని చెప్పడంతో ఆ చిన్నారి తాత తనను ఎలా తాకాడో చెప్పింది. జరిగినది అర్థం చేసుకున్న నర్స్ తాతయ్యపై ఆసుపత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వారిచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు తాతను అదుపులోకి తీసుకుని పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాతి రోజు చిన్నారికి వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
