Asianet News TeluguAsianet News Telugu

‘‘ మహాదేవ్ ’’ ఎఫెక్ట్ : 22 అక్రమ బెట్టింగ్ యాప్‌లను బ్లాక్ చేసిన కేంద్రం

మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ తరహా యాప్‌ల పనిపట్టాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా దాదాపు 22 అక్రమ బెట్టింగ్ యాప్‌లు , వెబ్‌సైట్‌లను బ్లాక్ చేస్తూ ఆదివారం కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Govt Issues Blocking Orders Against 22 Illegal Betting Apps Including Mahadev Book ksp
Author
First Published Nov 5, 2023, 9:50 PM IST

మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ తరహా యాప్‌ల పనిపట్టాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా దాదాపు 22 అక్రమ బెట్టింగ్ యాప్‌లు , వెబ్‌సైట్‌లను బ్లాక్ చేస్తూ ఆదివారం కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్ సిండికేట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన దర్యాప్తు.. ఛత్తీస్‌గఢ్‌లోని మహదేవ్ బుక్‌పై తదుపరి దాడులు, యాప్ చట్టవిరుద్ధ కార్యకలాపాలను వెల్లడించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

మహదేవ్ బుక్ యజమానులు ప్రస్తుతం కస్టడీలో వున్న సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 19 కింద వీరిని అరెస్ట్ చేశారు. సెక్షన్ 69ఏ ఐటీ చట్టం ప్రకారం వెబ్‌సైట్ లేదా యాప్‌ను షట్ డౌన్ చేయమని సిఫార్సు చేసే అధికారం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి వుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి తెలిపారు. వాస్తవానికి ఈడీ నుంచి తొలి అభ్యర్ధన స్వీకరించబడిందని, దానిపై చర్య తీసుకోబడిందని కేంద్ర మంత్రి తెలిపారు. 

కాగా.. ఛత్తీస్‌గడ్ ఎన్నికల ముంగిట్లో అక్కడ మహాదేవ్ యాప్ కేసు సంచలనం రేపుతున్నది. ఈ కేసులో సీఎం భుపేశ్ బఘేల్ పేరు కూడా వినిపించడంతో రాజకీయ దుమారం మొదలైంది. అసలే ఎన్నికల వేళ.. క్యాంపెయిన్ జోరుగా సాగుతున్న సమయంలో కాంగ్రెస్ లీడర్, సీఎం బఘేల్ పేరు రావడంతో రాష్ట్రాన్ని ఈ అంశం కుదిపేస్తున్నది. ఛత్తీస్‌గడ్‌లో మళ్లీ అధికారాన్ని పొందుతామనే ధీమాలో ఉన్న కాంగ్రెస్‌కు ఈ కేసు అశనిపాతంగా మారింది. రూ. 508 కోట్ల ముడుపులు సీఎం భుపేశ్ బఘేల్‌కు ఈ యాప్ ప్రమోటర్లు పంపించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ పేర్కొనడంతో ఈ రాజకీయ దుమారం రేగింది. 

క్యాష్ కొరియర్‌గా పనిచేస్తున్న అసిమ్ దాస్‌ నుంచి రూ.5.39 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుని, అతనిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ దాని ప్రమోటర్లపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అసిమ్ దాస్‌ను ప్రశ్నించడం, అతని నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు ఈడీ తెలిపింది.

ఈ క్రమంలో శుభమ్ సోనీ (మహాదేవ్ నెట్‌వర్క్ స్కాం నిందితుల్లో ఒకడు) దాస్‌కు పంపిన ఈమెయిల్‌ను పరిశీలించగా.. అనేక ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయని ఈడీ అధికారులు పేర్కొన్నారు. రెగ్యులర్‌గా, గతంలో జరిగిన చెల్లింపులకు సంబంధించిన కీలక సమాచారం సదరు మెయిల్‌లో వున్నట్లు తెలిపింది. అలాగే మహాదేవ్ యాప్ ప్రమోటర్లు.. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‌కు దాదాపు రూ.508 కోట్లు చెల్లించినట్లుగా ఈడీ సంచలన ప్రకటన చేసింది. 

ఇటీవల తనను ప్రత్యేకంగా దుబాయ్‌కు పిలిపించారని, ఆపై నగదు పంపిణీ చేయాలని నిర్ధిష్ట సూచనలతో తిరిగి పంపించారని అతను ఈడీకి తెలియజేశాడు. మహాదేవ్ బుక్ యాప్ అసోసియేట్‌ల నుండి నగదు అందుకుని, హోటల్ ట్రిటాన్‌లోని రూమ్ నంబర్ 311 వద్ద వేచి ఉండాల్సిందిగా తనకు చెప్పారని దాస్ వెల్లడించాడు. అనంతరం ఈ మొత్తాన్ని 'బాఘేల్' అసోసియేట్‌లకు డెలివరీ చేసేందుకు సిద్ధంగా వున్నాడని ఈడీ పేర్కొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios