Asianet News TeluguAsianet News Telugu

యూకే విమానాల రాకపోకలపై నిషేధం పొడగింపు... జనవరి 7 వరకు లేనట్టే...

కొత్తరకం కరోనాకు బ్రిటన్ కేరాఫ్ అడ్రస్ గా మారడంతో ప్రపంచం వణికిపోతోంది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా విజృంభణకు తోడు ఈ కొత్తరకం కరోనా ప్రజలను మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ కొత్త రకం కరోనా మొదటి దాని కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

Govt extends suspension of India-UK flights till January 7 amid new coronavirus strain scare - bsb
Author
Hyderabad, First Published Dec 30, 2020, 1:11 PM IST

కొత్తరకం కరోనాకు బ్రిటన్ కేరాఫ్ అడ్రస్ గా మారడంతో ప్రపంచం వణికిపోతోంది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా విజృంభణకు తోడు ఈ కొత్తరకం కరోనా ప్రజలను మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ కొత్త రకం కరోనా మొదటి దాని కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

దాంతో ప్రపంచ దేశాలన్నీ యూకే నుంచి వచ్చే విమానాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. వాటిలో భారత్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి డిసెంబర్ 31 అర్థరాత్రి వరకు భారత్ యూకే నుంచి విమాన రాకపోకలను నిలిపివేసింది. అయితే నేడు కేంద్రం మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. 

యూకే విమానలపై ఉన్న తాత్కాలిక నిలిపివేతను వచ్చే ఏడాది జనవరి 7వరకు పొడిగించింది. ఈ వార్తను యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ తెలిపారు. ‘యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి రానున్న విమానాలపై విధించిన తాత్కాలిక నిలిపివేతను జనవరి 7వరకు కొనసాగించనున్నాం. యూకేలో వచ్చిన కొత్త రకం కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామ’ని ఆయన అన్నారు. 

అంతేకాకుండా అనేక నిబంధనలను కూడా తప్పని సరి చేయనున్నట్లు, దానికి సంబంధించిన సమాచారం త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. గత వారమే యూకే విమానలపై నిలిపివేతను ప్రకటించామని, దానిని కొన్ని కారణాల వల్ల మరింత పొడిగిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే గత 14రోజులలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నా పాజిటివ్ అని తేలినా జీనోమ్ సీక్వన్సింగ్‌కు వెళ్లాలని కేంద్ర ఆరోఖ్య మంత్రిమండలి తెలిపింది. 

ఇప్పటి వరకు భారత్‌లో దాదాపు 20 కోత్త కరోనా కేసులు బయటపడ్డాయి. పాజిటివ్‌ అని తేలిన ప్రతి ఒక్కరు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే వారితో పాటు కలిసి ప్రయాణం చేసిన వారు, దగ్గిర బంధువులను ట్రేస్ చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వారు తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నవంబరు25 నుంచి డిసెంబరు23 అర్థరాత్రి వరకు యూకే నుంచి భారత్‌కు వచ్చిన ప్రతి ప్రయాణికుడిని ట్రేస్ చేస్తున్నామని, ప్రతి ఒక్కరికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios