న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ గురువారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై రాజ్‌నాథ్ సింగ్ కు గవర్నర్ నివేదిక ఇచ్చారు.

రెండు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై  గవర్నర్ ఢిల్లీ పెద్దలను కలిసి వివరించనున్నారు. రాష్ట్రపతి కోవింద్ ను కూడ గవర్నర్ కలిసే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి మోడీని కూడ కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ను  గవర్నర్ కోరినట్టు సమాచారం.

తెలంగాణలో  టీఆర్ఎస్  రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూఢిల్లీకి వచ్చాడు గవర్నర్. రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులపై  గవర్నర్ కేంద్రమంత్రికి నివేదిక ఇచ్చారు.