PM Modi: ‘వన్ ఇండియా, వన్ హెల్త్’  (ఒకే దేశం, ఒకే రకమైన ఆరోగ్య సదుపాయాలు) స్ఫూర్తితో గ్రామాలలో బ్లాక్, జిల్లా స్థాయిలో అవసరమైన ఆరోగ్య సదుపాయాలను తీసుకువస్తామని, వాటి నిర్వహణ మరియు అప్‌గ్రేడేషన్‌లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు. 

PM Modi: దేశంలో వైద్య, ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే లక్ష్యంలో భాగంగా కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కృషి చేస్తుందని ప్ర‌ధాని నరేంద్ర మోడీ తెలిపారు. నేడు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పోస్ట్-బడ్జెట్ వెబ్‌నార్‌లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ వెబ్ నార్ ప్ర‌ధాని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైద్య విద్యను ప్రోత్సహించేందుకు విధానాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. 

వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద నగరాలకు మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే విధంగా కేంద్ర ప్రభుత్వం రూప‌క‌ల్ప‌న చేస్తోందని ప్ర‌ధాని తెలిపారు. ఇందులో భాగంగా.. ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర విధానాన్ని అవలంబించిందని, ఇందులో ఆరోగ్యంపై మాత్రమే కాకుండా అన్ని రంగాల‌పై సమానంగా దృష్టి సారిస్తోందని అన్నారు.

ఈ క్ర‌మంలోనే.. ‘వన్ ఇండియా, వన్ హెల్త్’ (ఒకే దేశం, ఒకే రకమైన ఆరోగ్య సదుపాయాలు) స్ఫూర్తితో గ్రామాలలో బ్లాక్, జిల్లా స్థాయిలో అవసరమైన ఆరోగ్య సదుపాయాలను తీసుకువస్తామని, వాటి నిర్వహణ మరియు అప్‌గ్రేడేషన్‌లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు. పరిపూర్ణ ఆరోగ్య మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఆరోగ్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుక‌రావాల్సిన అవసరం ఉందని ప్ర‌ధాని మోడీ తెలిపారు, త‌ద్వారా మౌలిక సదుపాయాల రంగంలో విప్లవం వస్తుందని చెప్పుకోచ్చారు. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా స్వస్థతకు కూడా తన ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని అన్నారు. బడ్జెట్‌లో మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, మానవ వనరుల విస్తరణ, పరిశోధనను ప్రోత్సహించడం, ఆధునిక, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని వాడుకోవడంపై దృష్టి పెట్టామన్నారు. 

ఈ బృహ‌త్క‌ర్యంలో ..రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటును అందించాల‌ని, వైద్య విద్యను ప్రోత్సహించేందుకు త‌గు విధానాలను రూపొందించాలని ప్ర‌ధాని పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయిలో వైద్యవిద్య‌కు ఉన్న డిమాండ్‌ను తీర్చే స్థాయిలో ప్ర‌ణాళిక‌లు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని, రానున్న రోజుల్లో వైద్యులను, పారామెడిక్స్‌ను సిద్ధం చేయడానికి తగిన పథకాలకు రూపకల్పన చేయాలన్నారు. 

మెడిక‌ల్ కాలేజీల‌ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వాలు భూములను కేటాయించాలనీ, నేడు భావి పౌరుల ఉన్న‌తికి చ‌దువు ఎంతో అవ‌స‌ర‌మ‌ని అన్నారు. దేశ యువ‌త ఉన్న‌త చ‌దువు కోసం .. ఇత‌ర దేశాల‌ను వెళ్తుంద‌నీ, మరీ ముఖ్యంగా వైద్య విద్యను అభ్యసించేందుకు, చిన్న దేశాలకు వెళ్తున్నారని అన్నారు. అక్కడ భాషా సమస్య ఉందని, అయినప్పటికీ వెళ్తున్నారని చెప్పారు. ప్ర‌భుత్వ‌, ప్ర‌వేట్ రంగం భారీ స్థాయిలో ప్రవేశించడం సాధ్యమ‌వుతుంద‌ని అన్నారు. అలాగే.. స్వచ్ఛ్ భారత్ మిషన్, ఫిట్ ఇండియా మిషన్, న్యూట్రిషన్ మిషన్, మిషన్ ఇంద్రధనుష్, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ ఇలా అన్నింటిని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ప్ర‌ధాని అన్నారు.