గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు Aam Aadmi Party తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని బుధవారం ఖరారు చేసింది. అమిత్ పాలేకర్‌ను (Amit Palekar ) ఆప్ గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గోవాలోని పనాజీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు Aam Aadmi Party తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని బుధవారం ఖరారు చేసింది. అమిత్ పాలేకర్‌ను (Amit Palekar ) ఆప్ గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గోవాలోని పనాజీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రముఖ న్యాయవాదిగా ఉన్న అమిత్ పాలేకర్.. సామాజిక కార్యకర్తగా గుర్తించారు. ఆయన OBC భండారీ కమ్యూనిటీకి చెందినవారు.ఇక, గోవాలోని మొత్తం 40 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తనను ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంపై అమిత్ పాలేకర్ ఆనందరం వ్యక్తం చేశారు. అవినీతి రహిత గోవాను తీసుకోస్తానని అమిత్ చెప్పారు. రాష్ట్రం కోల్పోయిన వైభవాన్ని తీసుకురావడానికి ఆప్ కృషి చేస్తుందని వెల్లడించారు. ‘నేను చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాను. అది గ్యారంటీ’ అని పేర్కొన్నారు.
ఇక, ఐదు రాష్ట్రాల ఎన్నికలను రాజకీయ పార్టీలు సీరియస్‌గా తీసుకన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా అంతా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా సత్తా చాటేందుకు వ్యుహాలు రచిస్తుంది. మంగళవారం.. పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, నేడు ఆప్ గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమిత్ పాలేకర్ పేరును ప్రకటించారు.
గోవాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్‌కు చేదు అనుభవమే ఎదురైంది. గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లు ఉండగా.. ఆప్ 39 చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. చాలా ప్రతిష్టాత్మకంగా ప్రచారం నిర్వహించింది. కానీ ఒక్క సీటు కూడా గెలవలేపోయింది. అయితే ఈ సారి ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే అరవింద్ కేజ్రీవాల్ గోవాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఓటర్లను ఆకర్షించేందుకు భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం గోవాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న Arvind Kejriwal.. ఆప్ మేనిఫెస్టోను విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని.. ఉద్యోగం రాకపోతే నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్స్ ప్రారంభించి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆప్‌కి ఓటు వేస్తు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు రూ. 10 లక్షలు అందుతాయని చెప్పారు.
ఇదిలా ఉంటే.. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం సోమవారం చెప్పారు. ఆప్, తృణమూల్ పార్టీలు బీజేపీయేతర ఓట్లను మాత్రమే విచ్ఛిన్నం చేస్తాయని చిదంబరం చెప్పుకొచ్చారు. ఇక, గోవాలో 40 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 14న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మార్చి 10వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు.
