దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు బాలికను అపహరించి ఆమెకు మద్యం తాగించి అనంతరం ఆమెపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. 

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు బాలికను అపహరించి ఆమెకు మద్యం తాగించి అనంతరం ఆమెపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. నోయిడా సమీపంలోని దస్తంపూర్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఈ నెల 24వ తేదీని కుట్టు మిషన్ శిక్షణకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తోంది..

ఇంతలో ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి.. బాలిక నోట్లో బలవంతంగా మద్యం పోశారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. నిందితులిద్దరిని ప్రతిఘటించిన బాధితురాలిని తీవ్రంగా కొట్టారు.

రాత్రంతా ఆమెకు నరకం చూపించి మరుసటి రోజు ఉదయం బాలిక ఇంటి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.