Asianet News TeluguAsianet News Telugu

వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్.. సిలిండర్‌పై రూ.59 పెంపు

అసలే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య జనం విలవిలలాడిపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు మరో షాకిచ్చింది. వంటగ్యాస్ ధరలను పెంచింది.. 

gas cylinder price hiked
Author
Delhi, First Published Oct 1, 2018, 8:51 AM IST

అసలే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య జనం విలవిలలాడిపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు మరో షాకిచ్చింది. వంటగ్యాస్ ధరలను పెంచింది.. సబ్సిడీ, సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.

విదేశీ మారకద్రవ్య విలువ, అంతర్జాతీయ ధరల్లో మార్పు కారణంగా ధరలు పెంచాల్సి వచ్చినట్లు కంపెనీలు తెలిపాయి. దీని ప్రకారం సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.89, సబ్సిడీయేతర సిలిండర్ ధరల రూ.59 పెరిగింది. కాగా, పెరిగిన ధరలకు అనుగుణంగా వినియోగదారులకు చెల్లించే నగదు బదిలీ మొత్తాన్ని... రూ.320.49 నుంచి రూ.376కు పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios