స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, నక్సల్స్ వ్యతిరేక మిషన్లలో పాల్గొన్న అధికారులను కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న హీరోలను శౌర్య సేవా పతకాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. 

స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు భారత వైమానిక దళం అధికారులు, పోలీసు సిబ్బందికి సేవా అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. వారు దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ ఈ అవార్డులను అందించింది. ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ఫైటర్ పైలెట్‌తో పాటు మరొక తొమ్మిది మంది ఐఏఎఫ్ అధికారులకు భారత దేశపు మూడవ అత్యున్నత పతకమైన వీర చక్రను అందించారు. ఈ ఆపరేషన్స్ సిందూర్ లో ఆరు పాకిస్తానీ విమానాలను, మన ఫైటర్ పైలెట్లు కూల్చారు.

ఆపరేషన్ సిందూర్ నడిపించిన వైస్ చీఫ్ ఆఫ్ హెయిర్ మార్షల్ తివారీ, కమాండర్ ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రా, డిజి ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ అవదేశ్ భారతి సహా నలుగురు సీనియర్ ఐఏఎఫ్ అధికారులకు సర్వోత్తమ యుద్ద సేవ పథకాన్ని అందించనున్నారు.

కేంద్ర రాష్ట్ర దళాల సిబ్బందికి చెందిన 1090 పోలీసులకు పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 230 శౌర్య పతకాలు, 99 విశిష్ట సేవా పతకాలు, 750 మందికి ప్రతిభా సేవా పతకాలు ఉన్నాయి. శౌర్య పతకాలలో 152 జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి , 54 నక్సల్స్ వ్యతిరేక కార్యాకలాపాలను అడ్డుకుంటున్న సిబ్బందికి, 24 ఇతర ప్రాంతాలకు చెందిన వారికి లభించాయి. అలాగే నలుగురు అగ్నిమాపక సిబ్బందికి కూడా అవార్డులను అందించనున్నారు.

2025 మే 7న పాకిస్తాన్ పై మన దేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో క్షిపణి దాడులు చేసింది. పాకిస్థాన్లోనూ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోను ఈ దాడులు జరిగాయి. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది భారత ప్రభుత్వం.

పాకిస్తాన్ చెబుతున్న ప్రకారం భారతదేశం చేసిన మెరుపు దాడుల్లో ఎనిమిది మంది పౌరులు మరణించారు, 22 మంది గాయపడ్డారు. ముజఫరాబాద్ లో ఉన్న నాలుగు ఉగ్రవాద శిబిరాలను, మన ఫైటర్ జెట్లు నాశనం చేశాయి. పాకిస్తాన్ భద్రత దళాలు మన దేశానికి చెందిన వైమానిక దళ యుద్ధ చెట్లను డ్రోన్లను కూల్ చేశాయని చెప్పుకున్నాయి.

మన దేశం చెబుతున్న ప్రకారం 70కి పైగా ఉగ్రవాదులు మరణించారు. మరొక అరవై మందికి గాయాలయ్యాయి. అలాగే ఒక పాకిస్తాన్ యుద్ధ విమానం కూడా కూలిపోయింది.