యజమాని కుటుంబాన్ని కాపాడే క్రమంలో నాలుగు కుక్కలు ప్రాణత్యాగం చేశాయి. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం బాగల్ పూర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... బాగల్ పూర్ కి చెందిన పూనమ్ అనే వైద్యురాలు మూడు సంవత్సరాలుగా నాలుగు కుక్కలను పెంచుకుంటోంది. వాటిని తన ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగానే వారు భావించేశారు.

ఆ నాలుగు కుక్కల్లో ఒకటి తల్లి.. మిగితా మూడు దాని పిల్లలు. ప్రతిరోజూ రాత్రి ఇంటి బయటకు కాపలాకాయడం ఈ నాలుగు కుక్కలకు అలవాటు. ఈ క్రమంలోనే  రెండు రోజుల క్రితం అవి ఇంటికి కాపలాగా ఉన్న సమయంలో... ఇంట్లోకి ఓ పాము ప్రవేశించాలని చూసింది. దానిని అడ్డుకోవడానికి ఈ నాలుగు కుక్కలు ప్రయత్నించాయి.

ఈ క్రమంలోనే పాము కాటుకి గురయ్యి.. ప్రాణాలు విడిచాయి. కాగా... ఈ ఘటనంతా సమీపంలోని సీసీ టీవీ కెమేరాలో రికార్డు అయ్యింది. దీంతో వీడియో వైరల్ గా మారింది. తాము ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కలు ప్రాణాలు విడవడంతో డాక్టర్ కుటుంబసభ్యులు విలపించారు.