కారు పార్కింగ్ గొడవ.. తుపాకీతో కాల్పులు.. మూక దాడిలో నలుగురు మృతి..
Car Parking In Bihar: కారు పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ నలుగురి ప్రాణాలు బలిగొంది. వీరిలో ఒకరు తుపాకీ కాల్పులు వల్ల చనిపోగా, మూకదాడిలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా నబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది.
Car Parking In Bihar : కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం నలుగురి ప్రాణాలను బలిగొంది. ఈ దారుణం ఘటన బీహార్ లోని ఔరంగాబాద్ లో సోమవారం జరిగింది. మృతుల్లో ఒకరు తుపాకీ కాల్పులు వల్ల ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు మూకదాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఓ దుకాణం ముందు కారు పార్కింగ్ చేస్తుండగా ఆ షాప్ వ్యక్తి అభ్యంతరం తెలపడంతో ఈ దారుణం జరిగింది.
ఔరంగాబాద్ డీఎస్పీ మహ్మద్ అమానుల్లా ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. నబీనగర్ ప్రాంతంలో ఒక దుకాణదారుడు తన షాప్ ముందు కారు పార్క్ చేయడంపై అభ్యంతరం చెప్పాడు. తక్షణమే తన షాప్ ముందు నుంచి కారు తీసివేయాలని సూచించాడు. ఈ క్రమంలో దుకాణదారుడికి, కారులో వ్యక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన వాహనదారుడు తుపాకీ తీసి దుకాణందారుపై కాల్పులు జరిపాడు.
అయితే .. అది గురి తప్పడంతో అతడి పక్కనే ఉన్న వ్యక్తికి తూటా తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తుపాకీ కాల్పుల్లో తమ వాడు మరణించడంపై చుట్టుపక్కల దుకాణదారులు, స్థానికులు తీవ్రంగా స్పందించారు. అందరూ కలిసి కారులో వచ్చిన నలుగురిపై దాడి చేశారు. ఈ మూక దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ లోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చేరుకుని గుంపును చెదరగొట్టి.. వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గుంపును చెదరగొట్టే సమయానికి, మొహమ్మద్ ముజాహిద్, చరణ్ మన్సూరి, మహ్మద్ అన్సారీలను కొట్టి చంపారు. గాయపడిన వారిలో ఒకరూ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కారులో వచ్చి గొడవ పడిన నలుగుర్ని ఝార్ఖండ్ పాలాము జిల్లాలోని హైదర్ నగర్ వాసులని తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్పీ తెలిపారు.