మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోఎరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. ఆయన నిన్న ఆసుపత్రిలో బ్రెయిన్ లో వచ్చిన ఒక క్లాట్ కి శస్త్ర చికిత్స చేపించుకున్న సంగతి తెలిసిందే. 

84 సంవత్సరాల వయసున్న ప్రణబ్ ముఖర్జీ.... శస్త్ర చికిత్స అనంతరం ఆర్మీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన కరోనా పాజిటివ్ గా ఉండగానే వైద్యులు ఆయన మెదడులోని క్లాట్ కు శస్త్ర చికిత్సను నిర్వహించారు. 

2012 నుంచి 2017 మధ్యకాలంలో రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్.... నిన్న ఉద్యమ తాను కరోనా పాజిటివ్ గా తేలననై, వేరే పని మీద ఆసుపత్రికి వెళ్తున్నానని, గత ఎండు వారాలుగా తనను కలిసినవారంతా సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండలని, కరోనా పరీక్షలు కూడా చేపించుకోవాలని ఆయన ట్విట్టర్ వేదికగా కోరిన విషయం విదితమే. 

ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్నీ తెలుపగానే అయన త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మంత్రి పీయూష్ గోయల్ సహా అనేకమంది ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. 

ఇప్పటికే శివరాజ్ సింగ్ చౌహన్, యెడియూరప్ప వంటి   షా, ధర్మేంద్ర ప్రధాన్ వంటి మంత్రులు సహా అనేక మంది ప్రజాప్రతినిధులు ఈ కరోనా మహమ్మారి బారినపడ్డ సంగతి తెలిసిందే.