మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ పాజిటివ్ గా తేలారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

కరోనా మహమ్మారి సామాన్యుడు సెలబ్రిటీ అన్నతేడా లేకుండా వ్యాపిస్తోంది. ఇప్పటికే హోమ్ మంత్రి అమిత్ షా సహా అనేకమంది కరోనా బారినపడగా... తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా కరోనా వైరస్ పాజిటివ్ గా తేలారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

Scroll to load tweet…

తాను కరోనా వైరస్ బారినపడ్డానని, గత రెండు వారాలుగా తనను కలిసినవారందరు సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లడంతోపాటుగా కరోనా కి టెస్ట్ చేపించుకోవాలిసిందిగా కోరారు

ఇకపోతే... దేశ వ్యాప్తంగా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వరుసగా నాలుగో రోజూ 62 వేలకు పైగా కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. 

Scroll to load tweet…

దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,075కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 15,35,744 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,007 మంది కరోనాతో మృతి చెందారు. 

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 44,386 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 6,34,945 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.