మాజీ ఎంపీ, క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ బుధవారం నాడు కారు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకొన్నారు.

న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు అజహరుద్దీన్ ఫ్యామిలీ రాజస్థాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.ప్రమాదంలో అజహరుద్దీన్ స్వల్పంగా గాయపడ్డారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని సూర్వాల్ లో కారు ప్రమాదానికి గురైంది.  బుధవారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది.రాజస్థాన్ లోని రణతంబోర్  భవన్ కు అజహరుద్దీన్ కుటుంబం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న యువకుడు గాయపడ్డాడు.  ఈ ఘటనలో మహ్మద్ అజారుద్దీన్ కుటుంబ సభ్యులెవరూ కూడ గాయపడలేదని  స్థానికులు చెప్పారు. సంఘట స్థలాన్ని డీఎస్పీ నారాయణ్ తివారీ పరిశీలించారు.

ప్రమాద స్థలం నుండి అజహారుద్దీన్ కుటుంబం రణతంబోర్ లోని హోటల్ కు వేరే కారులో చేరుకొందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం నుండి అజహరుద్దీన్ కుటుంబం క్షేమంగా బయటపడడంతో ఆయన అభిమానులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.