26/11 ముంబయి దాడులు జరిగి.. నేటికి సరిగ్గా పదేళ్లు.  2008 నవంబర్‌ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబయి మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. కాగా.. ఈ ఘటనలో పాక్ ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ రోజు నివాళులర్పించారు.

ముంబయిలోని పోలీసు జింకానాలో పాక్ ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసులు అమరవీరులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాళులర్పించారు. ఆయనతోపాటు ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర పోలీస్ చీఫ్ దత్త పద్సాల్గికర్, ముంబయి కమిషనర్ ఆఫ్ పోలీసు సుబోద్ కుమార్ జైశ్వాల్ లు కూడా అమరవీరులకు నివాళులర్పించారు.

 

అప్పటి దాడుల్లో దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు పోలీసుల కుటుంబాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారంతా.. అమరవీరుల గొప్పతనాన్ని స్మృతించుకున్నారు.