మహారాష్ట్రలోని పూణెలోని లోనావ్లా ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాత Mumbai- Pune highway మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.
మహారాష్ట్రలోని పూణెలోని లోనావ్లా ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాత Mumbai- Pune highway మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. లోనావ్లా ప్రాంతంలోని షిలాత్నే గ్రామం వద్ద ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ముంబై నుంచి పుణె వెళ్తున్న కారు అదుపుతప్పి కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకని సహాయక చర్యలు చేపట్టారు. అయితే కారులో మొత్తం ఐదుగురు మరణించినట్టుగా పోలీసులు గుర్తించారు. అనంతరం కారులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు.
అనంతరం మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. మృతులను ముంబైలోని మీరా రోడ్‌లో నివాసముంటున్న మాసీదేవి తిలోక్ (42), సీమా రాజ్ (32), షాలినీ రూపనారాయణ్ రాజ్ (19), మహావీర్ రాజ్ (38), ముంబైలోని కుర్లా ప్రాంతానికి (Kurla area) చెందిన డ్రైవర్ రెహాన్ రిజ్వాన్ అన్సారీగా గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. పూర్తిగా దెబ్బతిన్న కారును అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి లోనావ్లా రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్ారు.
‘మృతులు ప్రయాణిస్తున్న కారు లోనావ్లా నుంచి పూణె వైపు వెళుతోంది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు నుంచి ఎదురుగా వస్తున్న కంటైనర్ ట్రక్కుపైకి దూసుకెళ్లింది. కారు అవతలి వైపు ఎలా వచ్చిందో తెలియదు.. కానీ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని అనుమానం ఉంది’ అని లోనావ్లా గ్రామీణ పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ సచిన్ బంకర్ తెలిపారు. మృతుదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖండాలాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. వారి బంధువుల రాక కోసం పోలీసులు వేచి ఉన్నారు.
