న్యూఢిల్లీ: తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మరికొద్దిగంటల్లో న్యూఢిల్లీ చేరుకుంటుదనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బోగీలో మంటలు చెలరేగాయి. పాంట్రీ ఎస్ 10, బీ1 బోగీలు అగ్నికి దగ్ధమయ్యాయి. 

ఏసీ బోగీ నుంచి మంటలు చెలరేగడంతో అధికారులు చాకచక్యంగా వ్యవహరించారు. మంటలు అంటుకున్న రెండు బోగీలను అధికారులు వేరు చేశారు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు అంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడటంతో అంతా సంతోషించారు. హైదారాబాద్ నుంచి ఢిల్లీ పయనమైన ఈ తెలంగాణ ఎక్స్ ప్రెస్ గురువారం ఉదయం 9గంటలకు ఢిల్లీ చేరుకోనుంది. 

అయితే ఢిల్లీకి సమీపంలో ఉదయం 8గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీబోగీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించిందని ప్రయాణికులు చెప్తున్నారు. అయితే ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.