Asianet News TeluguAsianet News Telugu

ల‌క్నోలోని హోట‌ల్ లో అగ్ని ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి, ఏడుగురికి గాయాలు.. కొనసాగుతున్న రెస్క్యూ

ల‌క్నో సిటీలోని హజరత్ గంజ్ హోట‌ల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తోంది. మరో ఏడుగురికి గాయాలు అయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 

Fire accident in a hotel in Lucknow.. Two dead, seven injured..  An ongoing rescue
Author
First Published Sep 5, 2022, 11:55 AM IST

ల‌క్నో సిటీలోని హజరత్ గంజ్ హోట‌ల్ లో సోమ‌వారం ఉద‌యం ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెందారు. ఏడుగురు గాయ‌ప‌డ్డారు. అనేక మంది భ‌య‌ప‌డి లోప‌లే చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది.

9 నిమిషాల్లో 20 కిలో మీటర్లు.. ప్ర‌మాద‌ సమయంలో సైరస్ మిస్త్రీ చేసిన త‌ప్పదేనా?

హజార్త్ గంజ్ ప్రాంతంలో ఉన్న లెవానా హోటల్ లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అయితే ఈ ఘ‌ట‌న‌కు కార‌ణాలు ఏంట‌నే విష‌యం ఇంకా స్ప‌ష్టం కాలేదు. ఈ అగ్నిప్ర‌మాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులకు సరైన వైద్య చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు.

ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న వెంట‌నే మంట‌ల‌ను ఆర్పేందుకు ఫైర్ ఇంజ‌న్లు చేరుకున్నాయి. మంట‌ల‌ను ఆర్పివేశాయి. భవనం లోపల చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ఫైర్ సిబ్బంది లోప‌ల ఉన్న ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డానికి గాజు అద్దాలను పగులగొట్టారు. మంటల వ‌ల్ల తీవ్ర‌మైన పొగ రావ‌డంతో చాలా మంది తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డారు. ఇంకా దాదాపు 20 మంది వ‌ర‌కు లోప‌ల చిక్కుకుపోయార‌ని భావిస్తున్నారు. 

అయితే సంఘటనా స్థలంలో అంబులెన్స్ లను ఏర్పాటు చేశారు. హోటల్ కు సమీపంలో ఉన్న హాస్పిట‌ల్ ల‌ను అలెర్ట్ చేశారు. అయితే హోటల్ స‌మీపంలో ఇరుకైన అప్రోచ్ రోడ్డు ఉంది. దీని వ‌ల్ల స‌హాయ చ‌ర్య‌లు, రెస్క్యూ ఆప‌రేష‌న్ నెమ్మ‌దిస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios