Sunny Leone : ఏంటీ... సన్ని లియోన్ కానిస్టేబుల్ కావాలనుకుంటుందా..?

లక్షలాదిమంది పోటీ పడతారు కాబట్టి ఉద్యోగ నియామక ప్రక్రియలో చిన్నచిన్న తప్పులు దొర్లడం సర్వసాధారణమే. కానీ ఉత్తర ప్రదేశ్ లో ఏకంగా సన్నీ లియోన్ పేరు, ఫోటోతో హాల్ టికెట్ జారీకావడం తీవ్ర దుమారం రేపుతోంది. 

Film actor Sunny Leone name and photo appears in police constable exam hall ticket in UP AKP

హైదరాబాద్ : సన్నీ లియోన్... పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ నటిగా మారిన ఈమె ఇప్పుడు పోలీస్ కావాలనుకుంటున్నారా?  ఉత్తర ప్రదేశ్ లో పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? ఇందుకోసం పరీక్ష రాసేందుకు కూడా దరఖాస్తు చేసుకున్నారా?... ఈ హాల్ టికెట్ చూసిన ప్రతిఒక్కరికి ఈ ప్రశ్నలే మెదలుతాయి. సన్ని లియోన్ పేరు, ఫోటోతో వున్న హాల్ టికెట్ ఒకటి సోషల్ మీడియా చక్కర్లు కొడుతుండటంతో దుమారం రేగింది. ఈ వ్యవహారం ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది.

సన్నీ లియోన్ ఏంటీ... పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించడం ఏమిటని అనుకుంటున్నారా? ఆమె ఉద్యోగానికి అప్లై చేయలేదు... కానీ ఆమె పేరుతో దరఖాస్తు నమోదయ్యింది. ఎవరో ఆమె పేరు, ఫోటోతో ఉత్తర ప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసారు. యూపీ ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను ఆహ్వానించగా ఆకతాయిలెవరో సన్నీ లియోన్ పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. 

ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి హాల్ టికెట్లు జారీ చేసారు. ఈ నియామక ప్రక్రియ చేపడుతున్న యూపీ పోలీస్ రిక్రూట్ మెంట్ ఆండ్ ప్రమోషన్ బోర్డ్ వెబ్ సైట్ లో ఈ హాల్ టికెట్లు వుంచారు. ఈ క్రమంలోనే సన్ని లియోన్ పేరు, హాల్ టికెట్ తో వున్న హాల్ టికెట్ వెలుగులోకి వచ్చింది. 

Also Read  ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లి, కొశ్చన్ పేపర్ చూసి.. బిల్డింగ్ పై నుంచి దూకేసిన స్టూడెంట్

ఈ హాల్ టికెట్ ప్రకారం... సన్ని లియోన్ ఫిబ్రవరి 17న అంటే నిన్న శనివారం ఎగ్జామ్ రాయాల్సి వుంది.  తిర్వా జిల్లా కనౌజ్ లోని శ్రీమతి సోనే శ్రీ స్మారక బాలిక మహావిద్యాలయను పరీక్ష సెంటర్ గా పేర్కొన్నారు. అయితే ఈ హాల్ టికెట్ పై ఎవరూ పరీక్ష రాయలేదని ఈ ఎగ్జామ్ సెంటర్ సిబ్బంది తెలిపారు.  

సన్నీ లియోన్ పేరుతో వున్న హాల్ టికెట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో యూపీ ప్రభుత్వం, పోలీస్ శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి. నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడుకుంటున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు సన్ని లియోన్ పేరుతో దరఖాస్తు చేసుకున్నవారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. యూపీకే చెందిన వ్యక్తి ఫోన్ నెంబర్ ఉపయోగించి ముంబై అడ్రస్ తో దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు. ఈ దరఖాస్తు ఫేక్ దిగా తేల్చారు పోలీసులు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios